నేడు ఎపి కాబినెట్ మీటింగ్...పోలీస్ యాక్ట్ సవరణతో సహా కీలక అంశాలపై చర్చ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శనివారం జరగనుంది. ఈ కేటినెట్ మీటింగ్ లో 2014 పోలీస్ యాక్ట్ సవరిస్తూ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించునే అంశంతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఎపి కేబినెట్ మీటింగ్ లో 2014 పోలీస్ యాక్ట్ ను సవరిస్తూ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు డీజీపీని రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా ఆర్డినెన్స్ జారీ చేసే విషయంపై కూడా ఈ మీటింగ్ లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అలాగే ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూకేటాయింపులు, రూ.4,234 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనపై సమావేశంలో చర్చించనున్నారు. మరో ముఖ్యమైన అంశం అసెంబ్లీ డిజైన్లకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.












Click it and Unblock the Notifications