రేపటి నుంచి తిరుమలలో వైభవంగా శ్రీవారి ఉత్సవాలు: ఆర్జిత సేవలు రద్దు

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం నాడు 55,537 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 20,486 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.02 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

ఏడు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీడీపీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

The annual Vasanthotsavam in Tirumala will be observed from April 21 to 23

శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఆదివారం శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేలా సాలకట్ల వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

తెల్లవారు జామున 6:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

రెండవరోజు- భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజైన 23వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

The annual Vasanthotsavam in Tirumala will be observed from April 21 to 23

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకిస్తారు. అలాగే- ఈ మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుంచి 6:30 గంటల వరకు ఆస్థానాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

సాలకట్ల వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మూడు రోజుల పాటు వివిధ ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. 21 నుంచి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. 21, 22 తేదీల్లో అష్టదళ పాదపద్మారాధన సేవ అందుబాటులో ఉంటుంది. 23వ తేదీన ఈ సేవను కూడా రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+