ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై ​ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ బృందాన్ని నియమించింది. సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్‌, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శివాజీని నియమించారు. సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలోనే సిట్‌ పని చేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్‌ బృందానికి పూర్తి అధికారాలు కల్పించారు.

The AP government formed a SIT on liquor irregularities during the YSRCP government

మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్‌కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు బృందం సీఐడీ చీఫ్‌ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ.90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నది అభియోగం. నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం సెట్ ఏర్పాటు చేసింది.

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ఏపీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు, చికిత్స పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద. దీంతో తెలంగాణలోని డీఎంఈ గుర్తించిన ఆస్పత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు సర్కారు అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణలో రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాని ఎన్టీఆర్ వైద్య సేవల సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+