మద్యం కేసులో ఆ ముగ్గురి బెయిల్ రద్దు, సరెండర్ - హైకోర్టు ఆదేశం..!!

మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందనప్ప లకు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరుచేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆ ముగ్గురి బెయిల్ రద్దు చేసింది. ఈ నెల 26వ తేదీ లోగా ఈ ముగ్గురు కోర్టు ముందు సరెండర్ కావాలని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ పిటీషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచించిన హైకోర్టు.. వాటిని విచారించాలని ఏసీబీ కోర్టును ఆదేశించింది.

మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవింద నప్పలకు డీఫాల్ట్‌ బెయిల్‌ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరికి ఈ తరహా బెయిల్ ఇవ్వటం పైన సీఐడీ వేసిన పిటీషన్ ను అనుమతించింది. సిట్‌ దాఖలు చేసిన చార్జిషీట్‌, సప్లిమెంటరీ చార్జిషీట్‌ అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ్‌రెడ్డి(ఏ31), కృష్ణమోహన్‌రెడ్డి(ఏ32), బాలాజీ గోవిందప్ప(ఏ33)లకు ఏసీబీ కోర్టు ఈ నెల 6న పొరపాటున డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. నిర్దిష్ఠ సమయంలోగా ఛార్జ్ షీట దాఖలు చేసామని వివరించారు.

the-ap-high-court-dismissed-acb-court-de-fault-bail-orders-for-accused-in-liquor-case

డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరుకు సంబంధించి రీతు చాబ్రియా వర్సెస్‌ యునియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆధారం చేసుకొని ఏసీబీకోర్టు నిందితులకు డీఫాల్ట్‌ బెయిల్‌ మం జూరు చేసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కేసుకు ఆ ఉత్తర్వులు వర్తించవని కోర్టుకు నివేదించారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన అనంతరం సీఆర్పీసీ సెక్షన్‌ 309 కింద నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోందన్నారు. నిందితుల కు డీఫాల్ట్‌ బెయిల్‌ పొందే వీలులేకుండా చేసేందు కు చార్జిషీట్‌ దాఖలు చేశామా? లేదా బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌ 187 ప్రకారం నిర్దిష్ట గడువులోగా చార్జిషీట్‌ వేశామా? అనే విషయంపై లోతైన విచారణ అవసరమని పేర్కొన్నారు. ఈ వివరాలు పరిగణనలో కి తీసుకున్న న్యాయమూర్తి విచారణ పూర్తి కావటంతో తీర్పు రిజర్వ్ చేసారు. ఈ రోజు తీర్పులో డీఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో.. ఈ ముగ్గురు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+