పెళ్లి కమీషన్ ఇవ్వనందుకు వరుడిపై దాడి చేసిన పెళ్లిళ్ల పేరమ్మ...!
ఓ యువకుడికి పెళ్లి కుదిర్చినందుకు తనకు చెల్లించాల్సిన కమీషన్ ఇవ్వకపోవడంతో ఆ యువకుడిపై దాడి జరిగింది. పెళ్లి చేసుకుని, అందుకు కారణమైన పెళ్లిల్ల పేరమ్మకు పట్టించుకోవడంతో ఆగ్రహం చెందిన పెళ్లి కుదిర్చిన మహిళ.. పెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి చేసింది. దీంతో పెళ్లయి సంవత్సరం కూడ కాకముందే... ఆమె చేతిలో గాయలపాలయ్యాడు.

పెళ్లి పేరమ్మతో కష్టాలు
పెళ్లి చేసుకోవడమంటే... చాల ప్రసహనమే ఎదుర్కోవాలి. ఇందుకోసం మొత్తం కుటుంబ సభ్యులు ఎంతో ఓర్పుగా తమకు నచ్చిన, స్టేటస్‌కు సరిపోయో వారిని వెతికి పట్టుకోవడం ఆధునిక సమాజంలో కష్టతరమవుతోంది. అందుకే మ్యాట్రిమోనియల్ వ్వవస్థల ప్రాధాన్యం పెరుగుతోంది. పెళ్లి సంబంధాలు కుదిర్చే పేరయ్యలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఇలా పెళ్లిల్ల పేరయ్యలతో కుదర్చిన వారికి కమీషన్లు కూడ ఇవ్వకపోవడంతో ఓ నవవరుడిపై పెళ్లి కుదిర్చిన పేరమ్మ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

పెళ్లి కమీషన్ కోసం వివాదం
నంద్యాల పట్టణానికి చెందిన షేక్ హుసేన్ బాషా వివావాం చేసుకునేందుకు పెళ్లిళ్లను కుదిర్చే ఖాజాబీ వద్దకు వెళ్లి సంబంధం గురించి వివరించాడు. దీంతో ఆమె ఓ రైతు కుటుంబానికి చెందిన యువతితో వివాహం కుదిర్చింది. అన్ని చక్కపెట్టిన తర్వాత పెళ్లి కూడ జరిగింది. పెళ్లి జరిగి ఏడు నెలలు కూడ వస్తుంది. అయితే ఇద్దరి మధ్య కమీషన్‌కు సంబంధించి వివాదం ముదిరింది.

పదివేల కోసం వెంటపడిన మధ్యవర్తి
అయితే ఖాజాబీకి సంబంధం కుదిర్చినందుకు కొంత డబ్బును ముట్టచెప్పాడు హుసేన్ భాష. అయితే ఒప్పందం ప్రకారం మరో పదివేల రూపాయలు ఇవ్వాల్సి ఉందని మధ్యవర్తి వెంటపడింది. వాటి కోసం ఖాజాబీ వరుడిపై ఒత్తిడి తెస్తోంది. అయితే చిరు వ్యాపారం చేసుకునే హుసేస్ బాష వద్ద డబ్బులు లేకపోవడంతో అవి చెల్లించలేక పోయాడు. డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ.. ఖాజాబీ వెంటపడింది.

డబ్బుల కోసం దాడి చేసిన మహిళ
ఈ నేపథ్యంలోనే తన వద్ద డబ్బులు లేవని తేల్చి చెప్పిన హసేన్ భాష ఆమె ఒత్తిడి భరించలేక భార్యతో కలిసి మూడు రోజుల క్రితం అత్తారింటికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన పెళ్లిళ్ల పేరమ్మ ఖాజాబీ సైతం వెళ్లింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి గోడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్ల పేరమ్మ ఆగ్రహానికి గురైంది. పక్కనే ఉన్న కర్రతో నవవరుడైన హుసెన్ భాషపై దాడి చేసింది. దీంతో భాష తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications