సబ్ కలెక్టర్ ఆఫీసులోకి సీఐడీ చీఫ్ ఎంట్రీ, సీన్ రీ కనస్ట్రక్షన్, రాత్రి ఏం జరిగింది చెప్పండి

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తు వేగవంతమైంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ? అంటూ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆ కార్యాలయం ఆవరణంలో అధికారులు మరోసారి పరిశీలించి వివరాలు సేకరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించిన అధికారులు అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై మరోసారి దర్యాప్తు చేశారు.

సోమవారం రాత్రి 10 గంటల నుండి మంగళవారం వేకువజామున మూడు గంటలు కొరకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దర్యాప్తు జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దర్యాప్తు చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆ జిల్లా అడిషనల్ ఎస్పీ రాజకుమార్, మదనపల్లె డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పాల్గొన్న అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

The CID Chief conducted the scene reconstruction at Madanapalle Sub Collector s office

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాలి బూడిదైన వివిధ డాక్యుమెంట్ లకు సంబంధించి అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ అలియాస్ తేజ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలో గౌతమ్ తేజ్ ను మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి తీసుకువచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అక్కడే అతని నుండి వివరాలు సేకరించారు.

అదే సమయంలో గతంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా పనిచేసిన హరిప్రసాద్ ను కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి ఆయన నుండి వివరాలు సేకరించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ రోజు రాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే విధుల్లో ఉన్న నిమ్మనపల్లె వీఆర్ఏ రమణను కూడా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి ఆయన నుండి వివరాలు సేకరించారు.

The CID Chief conducted the scene reconstruction at Madanapalle Sub Collector s office

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో బీరువాలో కారు ఇంజిన్ ఆయిల్ ఉన్న విషయం తెలిసిందే. ఆ కారు ఇంజిన్ ఆయిల్ ని గౌతమ్ తేజ్ ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు అక్కడ బీరువాలో పెట్టాడు అంటూ అక్కడే గౌతమ్ తేజ్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

The CID Chief conducted the scene reconstruction at Madanapalle Sub Collector s office

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రధాన అనుచరుడైన మాధవ రెడ్డి కోసం నెలరోజుల నుండి పోలీసులు వెతుకుతున్నా ఆయన ఆచూకీ మాత్రం చిక్కలేదు. ఈ సందర్భంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీ కన్స్ట్రక్షన్ నిర్వహించిన అధికారులు సమాచారం సేకరించడం హాట్ టాపిక్ అయ్యింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కేసు విచారణ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+