Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అన్న కంపార్టుమెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు క్యూ కాంప్లెక్స్ బయట కూడా వేచి ఉన్నారు. ఆషఢమాసం కావడంతో గత కొద్ది రోజులుగా తిరుమల భక్తుల రద్దీ తగ్గింది.

కానీ శుక్రవారం భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలొచ్చారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్యూ లైన్లలో ఉన్నవారికి అన్నపనీయాలు అందిస్తున్నారు. గురువారం తొలి ఏకదాశి కావడంతో శ్రీనివాసుడిని 62,005 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చింది. 34,127 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

tirumaladevooterscrowd

బుధవారం స్వామివారిని 71,615 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చింది.శ్రీవారి ఆలయంలో జలైలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. జులై 1న శని త్రయోదశి, జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 13న సర్వ ఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది.

కాగా గురువారం తిరుమల ఆలయానికి సమీపం నుంచి విమానాలు వెళ్లాయి. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం.. కానీ ఈ మధ్య కాలంలో తరచూ శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+