పాతవే: జీవన్, కేసీఆర్ వల్లే వాటిని కోల్పోయాం: పోట్ల

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు అన్నీ పాతవేనని కాంగ్రెసు పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ పైన కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హితవు పలికారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పైన త్వరగా తేల్చాలన్నారు.

The decisions of T cabinet were old: Jeevan Reddy

ఓటమిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో పార్టీ ఓటమిపై కార్యకర్తలు చెబుతున్న కారణాలు వాస్తవమేనని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 21 నుంచి గాంధీ భవన్‌లో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఓటమిపై చర్చ కాకుండా భవిష్యత్ కార్యాచరణపై చర్చించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తామన్నారు.

కేసీఆర్ స్థానికతపై విచారణ జరపాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో స్థానికతను లేవనెత్తిన కేసీఆర్ పైన పలువురు నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ... ముందు కేసీఆర్ స్థానికతపై విచారణ జరపాలన్నారు. అటు పోలవరంపై మాట్లాడిన ఆయన కేసీఆర్ వల్లే ముంపు ప్రాంతాలను తెలంగాణ కోల్పోయిందని ఆరోపించారు. టీఆర్ఎస్ వైఖరి వల్లే ఖమ్మం ప్రజలు నష్టపోయారన్నారు. ప్రస్తుతం ముంపు ప్రాంత ప్రజలు ఏపీ ప్రభుత్వ రాయితీలకు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.

ఇంటికో మొక్క: జోగు రామన్న

తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. దీనిలో భాగంగా ఇంటికో మొక్క నాటేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అటవీ భూములపై సర్వే చేసి సరిహద్దులు నిర్ణయిస్తామన్నారు. అటవీ భూములను పరిరక్షించేందుకు స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అటవీ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+