వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఘా విభాగం వైఫ‌ల్యం..! అందుకే ఏపి డీజీపి మార్పు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : నిఘా విభాగం పైన ఏపి స‌ర్కార్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓట‌ర్ల డేటా విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు స‌మాచారం. అస‌లు ఇంత రాద్దాంతం జరిగే వ‌ర‌కు ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు అనే దానిపై లోతైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఏపీ డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. డీజీపీ వ్యవహారశైలిపై ప్రతిపక్ష వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

<strong>ఎర్ర‌జొన్న రైతుల నిలువు దోపిడి..! పట్టించుకోని ప్రభుత్వం..!!</strong>ఎర్ర‌జొన్న రైతుల నిలువు దోపిడి..! పట్టించుకోని ప్రభుత్వం..!!

 ఏపి లో నిఘా విభాగం పైఫ‌ల్యం..! ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌భుత్వం..!!

ఏపి లో నిఘా విభాగం పైఫ‌ల్యం..! ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌భుత్వం..!!

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత డీజీపీ మార్పుపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇదే అంశంపై ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. డీజీపీని తొలగించాలని దాదాపు నిర్ణయానికి వచ్చిన కేంద్రం, తరువాత సీనియార్టీలో ఉన్న అధికారుల పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో సీనియర్ అధికారులు కౌముది, గౌతమ్ సవాంగ్‌లతో పాటు ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు పేర్లను పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం.

సీనియారిటి ఆధారంగా కొత్త డీజిపి..! పేర్ల ప‌రిశీల‌న షురూ..!!

సీనియారిటి ఆధారంగా కొత్త డీజిపి..! పేర్ల ప‌రిశీల‌న షురూ..!!

ఆర్పీ ఠాకూర్ తరువాత అత్యంత సీనియర్‌గా ఉన్న అధికారితో పాటు వివాదరహితుడిని ఎంపిక చేయాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. గతంలో 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీ డీజీపీగా ఉన్న ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను తప్పించి సీనియర్ అధికారి మహంతిని నియమించింది. అయితే ఎన్నికలు పూర్తి కాగానే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహంతిని తొలగించి ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను తిరిగి నియమించింది.

ఎన్నిక‌ల స‌మ‌యం..! ప్ర‌భుత్వానికి స‌వాల్ గా మార‌నున్న డిజిపి ఎంపిక‌..!!

ఎన్నిక‌ల స‌మ‌యం..! ప్ర‌భుత్వానికి స‌వాల్ గా మార‌నున్న డిజిపి ఎంపిక‌..!!

ఎన్నిక‌ల్లో టీడీపీ అనుకూలంగా ప‌నిచేసే వారైతే బాగుంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది. అందుకే ముగ్గురి జాబితాను ఇప్ప‌టికే సిద్దం చేసింది. వీరిలో ఎవ‌రైతే మెరుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతారు అనే అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు. అన్ని వ‌ర్గాల వారు గౌతం స‌వాంగ్ అయితే మేల‌ని అబిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో గౌతం స‌వాంగ్ హైద‌రాబాద్ పోలీస్ శాఖ‌లో ప‌లు కీల‌క ప‌ద‌వులు నిర్వ‌హించారు.

త‌ప్పు పున‌రావ్రుత్తం కావొద్దు..! చురుకైన అదికారి కావాలంటున్న ఏపి స‌ర్కార్..!!

త‌ప్పు పున‌రావ్రుత్తం కావొద్దు..! చురుకైన అదికారి కావాలంటున్న ఏపి స‌ర్కార్..!!

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ నేత‌ల‌తో ఆయ‌న స‌త్సంబంధాలు ఉన్నాయి. మ‌రో వైపు సురేంద్ర‌బాబు పేరు కూడా గ‌ట్టిగా వినిపిస్తుంది. గ‌తంలో విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌గా చేసిన సురేంద్ర‌బాబు రౌడీల‌ను అణిచి వేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. కాబ‌ట్టి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌నే స‌రైన అదికార‌ని కొంద‌రు వాదిస్తున్నారు. మొత్తానికి డేటా వ్య‌వ‌హారం ఠాకూర్ స్థాన చ‌ల‌నం కావ‌డం, కొత్త‌వారికి అవ‌కాశం రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

English summary
Sarkar seems to be angry over the intelligent department. In addition, the AP government is very serious about the voter data. There is a deep debate on what the AP police is doing till the time this happens. In this context, the government has been informed that it is going to change the RP Thakur, the AP DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X