వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతను ఉర్రూతలూగించిన తార: జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన సినీ తార జ్యోతిలక్ష్మిపై ఫేస్‌బుక్‌లో నెటిజన్లు తన అభిమానాన్ని కురిపిస్తున్నారు. బయటికి చెప్పుకోరు గానీ జ్యోతిలక్ష్మి కి ఎందరో అభిమానులు ఉన్నారని, వారందరికి ఇది విషాద వార్తేనని జర్నలిస్టు కెఎన్ మూర్తి ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టారు.

జ్యోతిలక్ష్మి తన నృత్యం ద్వారా, తన శృంగార భంగిమల ద్వారా ఓ తరాన్ని ఊపేసింది. జ్యోతిలక్ష్మి తెర మీద కనపడితే చాలు, కుర్రకారు ఈలలు వేసేది. ఆ ఈలలతో థియేటర్ మారుమ్రోగేది. సినిమా థియేటర్లు చాలా తక్కువగా ఉన్న కాలంలో, చిన్న చిన్న పట్టణాలకు వెళ్లి కుర్రకారు సినిమాలు చూసేది.

తడకలు కట్టిన థియేటర్లు కూడా ఉండేవి. వాటిలో కుర్రకారు జ్యోతిలక్ష్మి ఎద సౌందర్యాలకు మతిపోగొట్టుకునేది. ఆమె కన్నుగీటిన దృశ్యాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో తెర మొత్తం మీద చూపించేవారు. దాంతో యువత ఆమెకు తన గుండెలను పారేసుకునేది. ఆ తరంవారి అభిప్రాయాలు ఆమె మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఇలా వ్యక్తమయ్యాయి.

"ఈమె చాలా ఉదృతంగా నృత్యాలు చేసే కాలంలో నేను బాగా చిన్న పిలగాడ్ని. అయినా ఎల్ ఆర్ ఈశ్వరి పాడే పాటలకు ఈమెసినిమా డాన్సులు చేసేవారు. వాటిల్లో కొన్ని నాకు ఇప్పటికీ గుర్తున్నాయి" అని మంత్రాల నరసింహ శర్మ అంటూ ఆమె నృత్యం చేసిన రెండు పాటలను గుర్తు చేసుకున్నారు.

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

తీస్కో కోక కోలా....ఏస్కో రమ్ము సారా
చూస్తే..నిషా ,గుకేస్తే మజా
కలిపి కొట్టు మొనగాడా....

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

ఇంక ఎవర్ గ్రీన్ పాట.... లే..లే..లే..లేలేలే నా రాజా.. అనేవి ఎప్పటికీ గుర్తుంటాయని ఆయన చెప్పుకున్నారు..

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

"తాను న్ముకున్న మార్గాన్ని తాను పూర్తిగా పరిపుష్ఠం చేసిన స్త్రీ. ఆమె ఆత్మకు శాంతి లభించు గాక" అని అన్నారు.

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

అశోక్ కుమార్ కామారపు ఇలా అన్నారు - నిజమే ఎందరినో తన నృత్యాలతో అలరించిన జ్యోతిలక్ష్మి గారు స్వర్గంలో ఇంద్రసభలో అలరించేందుకై వెళ్లారేమో....

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

జ్యోతిలక్ష్మి ఓ తీయటి జ్ఞాపకం

"మన రోజులే నయమండి జ్యోతి లక్ష్మి సినిమాలో ఓ మెరుపు మెరిసేది ఇప్పుడో సినిమా అంతా ఉరుములే" అని జయలక్ష్మి జొన్నవిత్తుల అన్నారు.

ఇంక ఎవర్ గ్రీన్ పాట.... లే..లే..లే..లేలేలే నా రాజా.. అనేవి ఎప్పటికీ గుర్తుంటాయని ఆయన చెప్పుకున్నారు..

"తాను న్ముకున్న మార్గాన్ని తాను పూర్తిగా పరిపుష్ఠం చేసిన స్త్రీ. ఆమె ఆత్మకు శాంతి లభించు గాక" అని అన్నారు.

అశోక్ కుమార్ కామారపు ఇలా అన్నారు - నిజమే ఎందరినో తన నృత్యాలతో అలరించిన జ్యోతిలక్ష్మి గారు స్వర్గంలో ఇంద్రసభలో అలరించేందుకై వెళ్లారేమో....

మా కుర్రతనంలో ఒక ఊపు ఊపింది ఈ శృంగార తార! అని శాస్త్రి టీవిఎస్ గుర్తు చేసుకున్నారు.

"తెరమీద జ్యోతి లక్ష్మి కనబడగానే కుర్రకారు నేలవైపు పరిగెత్తుకెళ్ళి కూర్చునేవారు. (అప్పట్లో నేల - అనేది ఒక తరగతి. తెరకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత బెంచ్, కుర్చీ, రిజర్వ్ అనే తరగతులు కూడా ఉండేవి) ఏమైనా జ్యోతిలక్ష్మి ఇక లేరంటే మనస్సు చివుక్కుమంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆమెకు నివాళులు, శ్రద్ధాంజలి ఎంత మంది చెబుతారో మరి. స్మారక సభ పెట్టేంత పెద్ద మనసు ఎంతమందికి ఉన్నదో.." అని నాగభూషణ రావు తుర్లపాటి అన్నారు.

"శృంగారానికి నిర్వచనం చెప్పిన మా తరం నర్తకి, నటి ఆమె. నేటి కథానాయికల మాదిరి సిగ్గులేనిది కాదు. ఎందుకు భయం అభిమానులమని చెప్పుకోవడానికి? ఆమేమైనా నయీమా?? అభిమానం అనేకరకాలు. నేనూ ఆమె అభిమానినే" అని సీనియర్ జర్నలిస్టు నందిరాజు రాధాకృష్ణ అన్నారు.

"మన రోజులే నయమండి జ్యోతి లక్ష్మి సినిమాలో ఓ మెరుపు మెరిసేది ఇప్పుడో సినిమా అంతా ఉరుములే" అని జయలక్ష్మి జొన్నవిత్తుల అన్నారు.

"జ్యోతిలక్ష్మి డేన్స్ అంటే చాలా ఇష్టం....నారూమ్ మెట్ గా ఊన్న రోజు లవీ....నేను ఆ డేన్స్ లు మంచివి కాదుకదా అంటే చిరంజీవి....ఆ నాట్యంలో భంగిమలు,కళ చూడాలి అనేవాడు" సత్యప్రసాద్ కెపిఎన్ చిరంజీవి అన్నారు.

బహుశా, జ్యోతిలక్ష్మిపై అభిమానం కనబరుస్తూ వ్యాఖ్యలు చేసినవారంతా జ్యోతిలక్ష్మి కన్నా పదేళ్లు చిన్నవారు లేదా సరిసమానమైన వయస్సు గలవారై ఉంటారు. డిటెక్టివ్ సినిమాల్లోనూ పౌరాణిక చిత్రాల్లోనూ ఒకటేమిటి దాదాపుగా అప్పటి అన్ని రకాల సినిమాల్లో జ్యోతిలక్ష్మి తెర మీదికి వచ్చి సినిమా హాల్‌ను శృంగారభరితం చేసేది, వినోద సముద్రంగా మార్చేసిది.

డెబ్బయ దశకంలో నలుపు తెలుపు తెర మీద ఆమె నృత్య భంగిమలకు మనుసును జారవిడుచుకోని యువతరం ఉంటదంటే ఆశ్చర్యం లేదు. మాయదారి చిన్నోడు మనసే దోచేశాడు అనే పాటకు ఆమె నృత్యం చేసినంత సేపు థియేటర్ ఈలలు, చప్పట్లతో మారు మోగిపోయేది.

ఆ తర్వాత కలర్ సినిమాల్లోనూ ఆమె తన ఎద అందాలను తెలుగు ప్రేక్షకులకు పంచింది. జ్యోతిలక్ష్మి క్లబ్ డ్యాన్స్‌ల్లో కనిపించేది. ఇప్పటి హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన కన్నా ఎక్కువగా ఏమీ ఉండేది కాదు. ఓ తరాన్ని ఉర్రూతలూగించి, జీవనాడులను ఉప్పొంగించి జ్యోతిలక్ష్మి లేదంటే ఓ తరం యావత్తు విషాదంలో మునిగిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

English summary
Netizens reacted on the death of actress Jyothi Lakshmi's death. They recollocted their experiences about her dannces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X