విజయవాడ వేదికగా అద్భుతం ఆవిష్కరణ - తొలి సారిగా..!!
విజయవాడ కేంద్రంగా అద్భుతం ఆవిష్కరణ కానుంది. రాష్ట్రంలో సీప్టేన్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకు పున్నమి ఘాట్ వేదిక కానుంది. గతంలోనే సీప్లేన్ సేవలను ప్రారంభించాలని భావించారు. కానీ, ఇప్పుడు ఇందుకు ముహూర్తం ఖరారైంది. దీని ద్వారా రాష్ట్ర పర్యాటన రంగంలో కొత్త శకం ప్రారంభం కానుంది. ఏపీలో ప్రారంభిస్తున్న తొలి సీ ప్లేన్ పైన ఆసక్తి సాధారణ ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోంది.
సీ ప్లేన్ సర్వీసు
విజయవాడ కేంద్రంగా ఈ నెల 9న పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ను
ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొం దించిన 14 సీట్ల సీ ప్లేన్ ను ప్రారంభించేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ సీ ప్లేన్ పున్నమి ఘాట్ నుంచి బయల్దేరి శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద దిగేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

వరుస ప్రణాళికలు
ముందుగా విజయవాడ టు శ్రీశైలం, అదే విధంగా శ్రీశైలం టు విజయవాడ మధ్య సీ ప్లేన్ ప్రయోగం విజయవంతం అయితే ఈ రూటుతో పాటుగా మరిన్ని ప్రాంతాల్లో రెగ్యులర్ సర్వీసులు అందు బాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదే విధంగా రెండో విడతలో సాగర తీరం విశాఖలో, నాగార్జున సాగర్, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ ఈ సీ ప్లేన్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత సర్వీసుతో విజయవాడలో అమ్మవారి ఆలయం తో పాటుగా శ్రీశైలం లోని భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఈ సీ ప్లేన్ ను అందుబాటులోకి తెస్తున్నారు.
బోటు షికారు
ఇప్పటికే నాగార్జునసాగర్-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం అయింది. దాదాపు 120 కిలోమీటర్ల మేర ఈ ప్రయణం జరగనుంది. పర్యాటకుల నుంచి ఈ ప్రయణానికి భారీ స్పందన కనిపిస్తోంది.
నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షిస్తూ ఈ ప్రయాణం సాగుతోంది.మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా టూరిజం శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు కొత్త తరహా ప్రయాణాలు సామాన్యులను ఆకట్టుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications