ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీలో ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోగా, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, జనం తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. రానున్న రెండు రోజులు పాటు రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది సోమ, మంగళవారం ఎండలు దంచి కొడతాయని హెచ్చరించింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండ సమయంలో బయటకు రావద్దని అప్రమత్తం చేస్తున్నారు. అదే విధంగా ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.
పెరుగుతున్న వడగాల్పులు
ఏపీలో పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు వడ గాల్పుల తీవ్రత పెరగనుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో అటు అకాల వర్షాలతో పాటుగా ఈదురు గాలులు .. ఇటు ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నరు. విపత్తు నిర్వహణ సంస్థల తాజా బులెటిన్ ప్రకారం రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

అరెంజ్ అలర్ట్
ఈ రోజు, రేపు మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని 66 మండలాల్లో స్వల్పంగా, 7 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా నమోదయ్యాయి. రాయలసీమలో వడగాల్పులు మరింత తీవ్రంగా ఉన్నాయి, ముఖ్యంగా వైఎస్సార్ జిల్లా అట్లూరులో 41.4 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలులు ప్రజల రోజువారీ పనులపై తీవ్ర ప్రబావం చూపుతున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
అకాల వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏప్రిల్ 13-16 మధ్య తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో అసాధారణంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలే ఈ విభిన్న వాతావరణానికి కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. వర్షాలు, సముద్రతీర ప్రాంతాల సామీప్యత వల్ల ఆర్ద్రత స్థాయిలు పెరుగుతున్నాయి., ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది. కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉత్తరాంధ్రలో అల్లూరి జిల్లా సహా అక్కడక్కడా వడగండ్ల వాన కురిసింది.












Click it and Unblock the Notifications