తిరుమల హుండీ ఆదాయం రూ వందల కోట్లు, నెలలో భక్తులకు ఎన్ని కోట్ల లడ్డూలు ఇచ్చారంటే !
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో రానురాను రద్దీ పెరిగిపోతుంది. తిరుమలలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరస్వామిని జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రత్యేక దర్శనం టోకన్లు చిక్కకపోయినా సర్వదర్శనం అయినా చేసుకుని శ్రీవారిని దర్శించుకోవాలని కోట్లాది మంది భక్తులు వేచి చూస్తుంటారు.
తిరుమలలో మార్చి నెలలో 21.10 లక్షల మంది భక్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. మార్చి నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు రూ 118. 49 కోట్లు హుండీలో కానుకలు సమర్పించారు. మార్చి నెలలో తిరుమల శ్రీవారి భక్తులకు 1.01 కోట్లు లడ్డూలు విక్రయించారు. తిరుమలలో 42. 85 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి నెలలో తిరుమలలోని కల్యాణకట్టలో 7.86 లక్షల మంది భక్తులు తలనీనాలు సమర్పించుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

వేసవిలో తిరుపతి, తిరుమలలో ఎండ విపరీతంగా ఉంటుంది. ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా, విపరీతంగా వానలు పడినా తిరుమలకు భక్తులు వెళ్లే సంఖ్య ఏమాత్రం తగ్గదు. మామూలుగా వీకెండ్ లో తిరుమలకు ఎక్కువగా వెలుతుంటారు. వీకెండ్ కాకపోయినా తిరుమలలో భక్తల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో క్యూలైన్ల కంపార్ట్ మెంట్లు ఎక్కువగా నిండిపోయాయి. తిరుమలలో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో ఉచిత దర్శనానికి 18 కంపార్టె మెంట్లలో శ్రీవారి భక్తులు వేచి ఉన్నారు. టోకన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి 16 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. కంపార్ట్ మెంట్లలో భక్తులకు ఎప్పటికప్పుడు టిఫిన్, అన్న ప్రసాదంతో పాటు తాగునీరు, పాలు, మజ్జిగ అందిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

సర్వసాధారణంగా తిరుమలలో శుక్ర, శని, ఆదివారం రోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. అయితే గురువారం తిరుమలలో భక్తలు రద్దీ ఎక్కువ అయ్యిందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం 62, 549 మంది భక్తులు దర్శించుకున్నారు. 26, 816 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications