ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం!
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. స్టేషనరీ అండ్ ప్రింటింగ్ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ పోస్టింగ్ ఇవ్వడంలేదని, జీతభత్యాలు చెల్లించడంలేదని, చీఫ్ సెక్రటరీని కలవడానికి అనుమతివ్వడంలేదంటూ ఆయన అన్నీ రికార్డెడ్‌గా పెట్టుకున్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందంటూ ప్రభుత్వంమీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమైన తరుణంలో ఆయనకు పోస్టింగ్ వచ్చింది.
వాస్తవానికి ఈ పోస్టింగ్ ఇచ్చే సమయానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. కోర్టు ధిక్కారణ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే ప్రింటింగ్ అడ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ రెండు సంవత్సరాలపాటు ఆయన సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా పోరాడారు.

చంద్రబాబు ప్రభుత్వంలో విజిలెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీవీపై ప్రభుత్వం కొన్ని ఆరోపణలు ఎక్కుపెట్టి 2020 మేనెలలో సస్పెండ్ చేసింది. రెండు సంవత్సరాల నుంచి ఆయన సస్పెన్షన్‌ను పొడిగిస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశించిన నెల రోజుల తర్వాత ఏబీవీ సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మరో నెల రోజులకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. కోర్టు ఆదేశించినప్పటికీ తనకు జీతంతోపాటు పోస్టింగ్ కూడా ఇవ్వడంలేదంటూ ఆయన ఆరోపించారు. చీఫ్ సెక్రటరీని ఒకసారి కలిశారు. తర్వాత కలవడానికి ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఇలాంటివన్నీ ఒక నివేదిక రూపంలో తయారుచేసి కోర్టు ధిక్కార పిటిషన్ వేసే సమయంలో పోస్టింగ్ రావడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వంపై విజయం సాధించిన తరుణంలో మున్ముందు ఆయన ఎన్ని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications