TTD: తిరుమలకు ద్విచక్రవాహనాల పై ఆంక్షలు - నడక మార్గాలపై టీటీడీ కీలక సూచన..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మెత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా సమావేశైన టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలి సారి బ్రహ్మోత్సవా రద్దీని ఇస్రో పరిశీలన చేస్తోంది. అదే విధంగా భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక..బ్రహ్మోత్సవాల వేళ ప్రత్యేక దర్శనాలు రద్దు చేసారు. గరుడ సేవ సమయాన తిరుమలకు ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు విధించారు. నడక మార్గం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్లు ఛైర్మన్ బీర్ నాయుడు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్స వాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 05.43 గం.ల- 06.15 గం.ల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణము నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కాగా, ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్దశేష వాహనంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 25వ తేదీన ముఖ్యమంత్రి పిఏసి- 5 శ్రీ వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తారు.

అదే విధంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇస్రో సహకారంతో శాట్ లైట్ ఆధారంగా భక్తుల సంఖ్యను గణన చేసేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, వివిధ దేవతామూర్తుల ఆర్చిలు, ఎల్ఇడి తోరణాలు, అన్ని ప్రధాన కూడళ్ళలో పెద్ద ఎల్ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక, బ్రహ్మోత్సల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్.ఆర్.ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని... బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు. ప్రతి రోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ఇక, ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటల నుండి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. అదేవిధంగా, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉంటాయని స్పష్టం చేసారు. తిరుమలలోని రద్ధీ ప్రాంతాల్లో అదనపు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు స్వామివారి వాహన సేవలను వీక్షించేలా హెచ్‌డి క్యాలిటీతో నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. తిరుమల లో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఫల పుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వివరించారు.












Click it and Unblock the Notifications