సొంత పార్టీ నాయకుల లొల్లి, చైర్మన్ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్

మూడు నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జగన్ ప్రభుత్వం పతనం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం వైసీపీ చెందిన అనేక మంది ఎంపీలు, మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీలో

వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలోకి జంప్ కాకుండా చూసుకోవాలని మాజీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. మాజీ మంత్రి, సొంత బాబాయ్ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోవడంతో జగన్ షాక్ అయ్యారు. ఇద్దరు మాజీ ఎంపీలు సైతం వారి పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి మునిసిపల్ చైర్మన్ ను ఆమె పదవికి రాజీనామా చెయ్యాలని సొంత పార్టీ కౌన్సిలర్లు, ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

The own party leaders are pressuring the Kadiri Municipal Chairman to resign from her post

కదిరి మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లు విజయం సాదించారు. కదిరి మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు ఎక్కువ మంది విజయం సాదించడంతో అదే పార్టీకి చెందిన నజీమున్నీసాను చైర్మన్ గా ఎన్నుకున్నారు. సుమారు మూడు సంవత్సరాల నుంచి మీరు చైర్మన్ గా పని చేస్తున్నారని, అయినా పట్టణంలోని 36 వార్డుల్లో ఒక్క వార్డులో కూడా పనులు చేయించలేదని, మీరు సక్రమంగా పని చెయ్యడం లేదని వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ నజీమున్నీసాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా సొంత పార్టీ చైర్మన్ నజీమున్నీసా ఆమె పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ వైసీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్లు ఆమెకు వినతి పత్రం రాసి అందులో సంతకాలు చేసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సొంత పార్టీ నాయకులు రాజీనామా చెయ్యడంతో కదిరి మునిసిపల్ చైర్మన్ నజీమున్నీసా కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారని తెలిసింది.

The own party leaders are pressuring the Kadiri Municipal Chairman to resign from her post

కదిరి మునిసిపల్ చైర్మన్ నజీమున్నీసా సక్రమంగా వైసీపీ కోసం పని చెయ్యలేదని, అందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని, అందుకే ఆమె బాధ్యత వహించి ఆమె పదవికి రాజీనామా చెయ్యలని వైసీపీ కౌన్సిలర్లు అంటున్నారు. కదిరి మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కదిరి మునిసిపల్ వ్యవహారం ఎంత వరకు దారితీస్తుందో అంటూ ఇప్పుడు కదిరి పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+