చంద్రబాబు చేతిలో ఆర్డీఓల జాతకాలు, ఉద్యోగం ఊడింది, వాతలు మిగిలాయి, అంతేనా

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు కాలిపోయిన ఘటనలో అధికారుల మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఏమైనా చేయ్యడానికి అవకాశం ఉంటుందని నిరూపించుకున్న రెవెన్యూ శాఖ అధికారుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు ఉన్నతాధికారుల మీద ప్రభుత్వం వేటు వెయ్యడంతో మిగిలిన ఉద్యోగులకు ఇప్పుడు దడ మొదలైయ్యింది.

గతంలో మదనపల్లె ఆర్డీఓగా పని చేసిన మురళి, ప్రస్తుతం మదనపల్లె ఆర్డీఓగా పని చేస్తున్న హరిప్రసాద్ ను సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఆర్డీఓలు హరిప్రసాద్, మరళిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని, ఇద్దరికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనకు సంబందం ఉందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ, సిసోదియా మీడియాకు చెప్పారు.

The police are investigating the RDOs in the Madanapalle sub collector office case

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ, సిసోదియా స్వయంగా మదనపల్లె చేరుకుని మూడు రోజుల పాటు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిశీలించి విచారణ చేసిన తరువాత ఇద్దరు ఆర్డీఓల మీద వేటు వెయ్యడం రెవెన్యూ శాఖలో కలకలం రేపింది. ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్ తో పాటు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న గౌతమ్ తేజ్ అలియాస్ తేజ్ ను కూడా సస్పెండ్ చేసి అతని మీద విచారణ కమిటీ వేశారు.

రెవెన్యూ శాఖ అధికారులు హరిప్రసాద్, మురళి, గౌతమ్ తేజ్ ముగ్గరూ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు ఆయన కుటుంబం, వారి అనుచరులు, వైసీపీ నాయకులతో చాలా సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ భూములను వారికి కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫోర్జరీ సంతకాలు చెయ్యడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం, భూ రికార్డులు మార్చి గోల్ మాల్ చేశారని, నేరపూరితంగా విదులు నిర్వహించారని ఆరోపణలు రావడంతో ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామని రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులు అంటున్నారు.

The police are investigating the RDOs in the Madanapalle sub collector office case

ప్రత్యేక విచారణ కమిటీతో ఈ ముగ్గురు బాగోతం మీద ఇప్పటికే విచారణ మొదలైయ్యింది.ఆదివారం సెలవు రోజు అయినా ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు ఫైళ్లు పరిశీలించారని, చాలా ఫైల్స్ కు క్లియరెన్స్ ఇచ్చారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, మరో ఉద్యోగి గౌతమ్ ఒక్కొ ప్రశ్నకు నోరు విప్పుతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+