TTD:తిరుమలలో దర్శనం కోసం మూడు కిలో మీటర్ల క్యూ - టీటీడీ కీలక సూచన..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులు..వారాంతం వస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మూడు కిలో మీటర్ల మేర భక్తులు బారులు తీరారు. మరో వైపు తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. క్యూ లైన్లలోకి వర్షపు నీరు చేరుతోంది. దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది.

తిరుమలలో భారీ వర్షం : తిరుమలలో ఒక వైపు భారీ వర్షం కురుస్తోంది. మరో వైపు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావటంతో స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో దర్శనం కోసం కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు దాదాపు మూడు కిలో మీటర్ల మేర భక్తుల లైన్లు కొనసాగుతున్నాయి. పెగిరిన రద్దీతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. దర్శనం కోసం 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు. భక్తులకు కావాల్సిన అన్నప్రసాదం, మంచి నీరు అందిస్తున్నారు.

 ttddevoters-

మూడు కిలో మీటర్ల క్యూ : భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక సూచన చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాల లేఖలను తగ్గించాలని సూచించింది. జూన్ 15వ తేదీ వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా నిర్ణీత తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయించింది. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.

టీటీడీ తాజా సూచన : అదే విధంగా ప్రతీ నెల 21వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను విడుదల చేస్తారు. ప్రతీ నెలా 23వ తేదీన శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ తేదీల్లో భక్తులు సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా యాప్ ధ్వారా బుక్ చేసుకొనే అవకాశం వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+