తెలుగు రాష్ట్రాలను తాకిన రుతుపవనాలు - నాలుగు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. ఈ సారి ముందస్తుగానే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోహిణీ ప్రభావం కనిపించ లేదు. ఇక, ఇప్పుడు రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకిన సమయంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో సోమవారమే అల్పపీడనం ఏర్పడుతుందని, మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడు తుందని అంచనా వేస్తోంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.

నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణను తాకాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు సహా ఇతర ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతా కు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య మహారాష్ట్రలో కొనసా తున్న తీవ్ర అల్పపీడనం బలహీనడి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం కి ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే సమయం లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించటంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాల పైన వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

The southwest monsoon arrived in AP Heavy Rain Alert For Next 4 Days

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా.. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్.

గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం న్యం, విశాఖ పట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+