రుతుపవనాలు వచ్చేస్తున్నాయి, వర్షాలు ఈ సారి - వాతావరణ శాఖ బిగ్ అప్డేట్..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు.. అదే సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సారి వర్షాకాలం ముందే రానున్నట్లు వెల్లడించింది. మే 27వ తేదీన నైరుతీ రుతు పవనాలు కేరళను తాకనున్నట్లు పేర్కొంది. ఇక రానున్న రెండు రోజుల్లో ఏపీలో అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ అయింది.
ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. మరో మూడు రోజుల్లో అండ మాన్ ను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 27న కేరళను తాకనున్నట్లు వెల్ల డించారు. అంచనా వేసినట్లు ముందుగానే రుతుపవనాలు కేరళను చేరితే, అప్పుడు 2009 తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగా వస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. 2009 సంవత్స రంలో మే 23వ తేదీన నైరుతీ కేరళను తాకినట్లు ఐఎండీ డేటా చబుతోంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ వరకు కేరళలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ రుతుపవనాల వల్లే దేశంలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది.

ఆ తర్వాత జూలై 8వ తేదీలోగా దేశవ్యాప్తంగా ఆ రుతుపవనాలు విస్తరిస్తాయి. ఇక సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగమనం అవుతాయి. అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తి ఆ రుతుపవనాలు వెళ్లిపోతాయి. 2025 వర్షాకాలంలో.. సాధారణం కన్నా అధికంగానే వర్షం కురు స్తుందని ఏప్రిల్‌లో ఐఎండీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఎల్ నినో పరిస్థితులు ఉండబోవని ఐఎండీ పేర్కొన్నది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం నార్మల్ స్థాయి కన్నా ఎక్కువే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు












Click it and Unblock the Notifications