ఏపీలో నాలుగైదు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే - తీవ్ర స్థాయికి..!!
ఏపీలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఏపీలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గాయి. మోచా తుఫాను దిశ మార్చుకోవటంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. అటు హైదరాబాద్ లో మరోసారి పలు చోట్ల భారీ వర్షం కురింసింది. అనేక జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, గుజరాత్, విదర్భ, తెలంగాణ మీదుగా వీస్తున్న ఉష్ణ గాలుల ప్రభావంతో రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసారు. బుధవారం రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో 43.15 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 43.09, తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం, పొట్టిశ్రీరాములు జిల్లా రాపూరు, వైఎస్సార్ జిల్లా కడపల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యయని వెల్లడించింది.

అల్లూరి జిల్లా రాజవొమంగి, అనకాపల్లి జిల్లా నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు 45, ఎల్లుండి 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మరోసారి భారీ వర్షం పడింది. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. ఈదురుగాలులతో కుండపోతగా కురిసిసింది. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పలు జిల్లాల్లో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications