అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీం కీలక ఆదేశాలు, ఇక..!!

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు పైన సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. దీని పైన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీం లో పిటీషన్ దాఖలు చేసారు. జమ్ము కశ్మీర్‌లో పునర్విభజన సమయంలో.. ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీని పైన విచారణ చేసిన సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్ము కశ్మీర్‌లో పునర్విభజన సమయంలో.. ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌తో కూడి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది.

The Supreme Court rejected a plea seeking delimitation in Andhra Pradesh and Telangana

2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే మిగతా రాష్ట్రాల నుంచి కూడా డీలిమిటేషన్‌పై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రా యపడింది. జమ్ము కశ్మీర్‌పై ప్రత్యేక దృష్టిసారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. జమ్ము కశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం.. ఏకపక్షం, విపక్షం కాదని చెబుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఆర్టికల్ 170(3) ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పరిమితులు ఉండే అవకాశముందని పేర్కొంది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఇచ్చిన ప్రతిపాదనలో మార్పులు చేయడం కేంద్రం నిబంధనల ప్రకారమేనని వివరించింది. ఏపీ, తెలంగాణ లను మినహాయించి కొత్తగా రూపొందించిన జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే పునర్విభజన చేయడం అసమంజసమని పేర్కొన్న పిటీషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్టికల్ 170(3) ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వి భజనపై పరిమితులు ఉండే అవకాశముందని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పున ర్వ్యవస్థీకరణ రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో జనగణన పూర్తయిన తరువాతనే సీట్ల పెంపు పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+