తాడిపత్రి గొడవల్లో సార్ పాత్ర ?, నెల రోజుల సెలవులో బ్యాంకు మేనేజర్, ఏం జరిగుతోంది ?
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత పలు జిల్లాల్లో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి (ప్రస్తుతం సత్యసాయి జిల్లా)లో జరిగిన గొడవలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ ప్రాంతంవైపు చూసింది. ఇప్పుడు అదే తాడిపత్రి సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ మేనేజ్ వ్యవహారం గురించి అనేక ఆరోపణలు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
తాడిపత్రి సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న అనీల్ కుమార్ రెడ్డి పేరుకు మాత్రమే చీఫ్ మేనేజర్ ఉద్యోగం చేస్తున్నారని, ఆయన నిత్యం తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెంట తిరుగుతూ వాళ్ల సొంత పనులు, వాళ్ల వ్యవహారాలు చూసుకునే వారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా గతంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్ అనీల్ కుమార్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయని, అప్పట్లో ఆయన బ్యాంకులో విధులు నిర్వహించడానికి సక్రమంగా వచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి.

పాతకక్షలు, గొడవలతో ప్రాణం భయంతో అప్పుడప్పుడు బ్యాంకులో ఉద్యోగం చెయ్యడానికి వచ్చే అనీల్ కుమార్ రెడ్డి సక్రమంగా ఉద్యోగం చేసేవాడు కాదని, ఏ పోస్టులో ఉన్నా ఆయన విధులకు హాజరుకావడం అంతంత మాత్రమే అని ఆ బ్యాంకులో ఉన్న కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇన్ని కేసులు ఉన్నా, విధులకు సక్రమంగా హాజరుకాకపోయినా ఆయనకు పదోన్నతి ఇచ్చి బ్యాంకు చీఫ్ మేనేజర్ పోస్టు ఇచ్చారని అదే బ్యాంకులోని కొందరు ఉద్యోగులు అంటున్నారని టీడీపీ ఆరోపిస్తున్నది.
చీఫ్ మేనేజర్ పదవి వచ్చిన తరువాత అనీల్ కుమార్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చుట్టూ ఎక్కువగా తిరగడం, వైసీపీ నాయకులు అందరితో టచ్ లో ఉండటంతో పై అధికారులు సైతం ఆయన్ను ఏమీ మాట్లాడలేక, మందలించలేక మౌనంగా ఉండిపోయారని ఆరోపణలు ఉన్నాయి. జీతం తీసుకునేది బ్యాంకులో అయితే అదే బ్యాంకుకు చుట్టపుచూపుగా వస్తున్న అనీల్ కుమార్ రెడ్డి ఎక్కువగా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు హాజరు అవుతూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దగ్గర స్వామి భక్తి ప్రదర్శించేవారని ఆరోపణలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత తాడిపత్రిలో గొడవలు జరగడం, టీడీపీ, వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చెయ్యడంతో బ్యాంక్ చీఫ్ మేనేజర్ అనీల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా మాయం అయ్యారు. నెల రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టిన అనీల్ కుమార్ రెడ్డి ఎవ్వరికి కనిపించకుండాపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
తాడిపత్రిలో జరిగిన గొడవల వెనుక బ్యాంకు మేనేజర్ అనీల్ కుమార్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని టీడీపీ నాయకులు కాలవ శ్రీనివాసులు, సాంబశివుడు తదితరులు ఆరోపిస్తున్నారు. అయితే అనీల్ కుమార్ రెడ్డికి నిజంగానే గొడవలతో సంబంధం ఉందా ?, లేదా ? అనే విషయం మాకు తెలీదని, పోలీసులు ఆయన మీద చర్యలు తీసుకుంటే తాముకూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకు సీనియర్ అధికారులు అంటున్నారు.
అనీల్ కుమార్ రెడ్డి నెల రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టడం వాస్తవం అని బ్యాంకు ఉన్నతాధికారులు నిర్దారించారు. అయితే అనీల్ కుమార్ రెడ్డి నిజంగానే ఆనారోగ్యంతో బాదపడుతున్నారా ?, తాడిపత్రి గొడవలతో సంబంధం ఉందని పోలీసుల భయంతో మాయం అయ్యారా అనే విషయం పోలీసులే తేల్చాలని టీడీపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద తాడిపత్రి సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ మేనేజర్ అనీల్ కుమార్ రెడ్డి ఇప్పుడు వివాదంలో చిక్కుకోవడం తాడిపత్రిలో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై బ్యాంకు మేనేజర్ అనీల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు స్పందిల్సివుంది.












Click it and Unblock the Notifications