ఆర్థిక మంత్రికి తెలీకుండా బిల్లులు ఇచ్చారా, జగన్ మాయ చేశారు, పయ్యావుల
గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో జరిగిన అన్ని అవకతవకలపై విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో జరిగిన అవకతవకలు, బిల్లుల చెల్లింపుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆశ్చర్య వ్యక్తం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక శాఖా మంత్రి ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లించారని, అప్పటి వైసీపీ ప్రభుత్వం పెద్ద మాయ చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అప్పటి ఆర్థిక శాఖా మంత్రి జిల్లాల పర్యటనలో ఉన్న సందర్భంగానే ప్రభుత్వ అధికారులు ఈ బిల్లులు విడుదల చేయడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

2014 నుండి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉందని, ఆ సమయంలో చెల్లించాల్సిన బిల్లుల ఫైల్స్ పక్కనపెట్టి తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో బిల్లులు చెల్లించడం ఎంతవరకు సబబు అని మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ఏరకంగా అధికారులు ఆ బిల్లులు చెల్లించారు అనే అంశంపై ఆరా తీస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. యూసీల పేరుతో బిల్లులు చెల్లించారనే వాదనను ఆర్థిక శాఖ వర్గాలు తెరమీదకు తెచ్చాయి.
అయితే తెలుగుదేశం హయాంలో చెల్లించాల్సిన బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారు, వైసీపీ ప్రభుత్వం హయాంలోని బిల్లులు మాత్రమే ఎందుకు చెల్లించారు అనే విషయంలో ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంగా వివరణ ఇవ్వడం లేదని, ఈ విషయంలో పూర్తి సమాచారం సేకరించిన తర్వాత నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడుకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో చాలా అవకతవక జరిగాయని, కొందరు వైసీపీ నాయకులు చెప్పినట్లు చాలా మంది అధికారులు పనిచేయడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్రంగా నష్టం జరిగింది మంత్రిపై పయ్యావుల కేశవ్ ఆరోపించారు. మొత్తం మీద గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో జరిగిన వ్యవహారం మొత్తం బయటకు తీయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.












Click it and Unblock the Notifications