తిరుమల లడ్డూ వివాదం, మాజీ సీఎం జగన్ కు మరో యమగండం

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇప్పుడు జగన్ ను అధికారం నుంచి దించడమే కాకుండా త్వరలోనే ఆయనతోపాటు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీలోని కొందరు నాయకులను ఈ రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, వాళ్ళు చేసిన పాపాలు అలాంటివని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జగన్ పై విరుచుకుపడ్డారు.

మీరు అడగాల్సిన ప్రశ్నలు, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అడగవలసిన విషయాలను మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని అడకుండా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే ఏం ప్రయోజనం ఏముంటుందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డుల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించాలా లేదా ? అనే విషయంపై జగన్ తో పాటు వైసీపీ నాయకులు శ్రీవారి భక్తులకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ, ఆంజనేయులు ఆరోపించారు.

The TDP MLA alleged that people will drive Jagan and YCP leaders out of Andhra Pradesh state

తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి విషయం బయటపడిందని భయపడుతున్న జగన్, వైసీపీ నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై ఎదురు దాడి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఎంత దైవ భక్తి ఉందో ఈ దేశం మొత్తం తెలుసని, ఇక మీ వీరవిధేయుడు భూమన కరుణాకర్ రెడ్డికి ఎంత స్వామి భక్తి ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసరి, వాళ్లు చేసిన పనులు అలాంటివని టీడీపీ ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులు జగన్ ఉద్దేశించి వ్యంగంగా అన్నారు.

మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తప్పు చేయకపోతే విజిలెన్స్ విచారణకు సహకరించాలని, అలా కాకుండా విజిలెన్స్ విచారణ రద్దు చేయాలని ఎందుకు హైకోర్టును ఆశ్రయించారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. విజిలెన్స్ విచారణలో చిక్కిపోతామనే భయంతోనే వైవీ. సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

The TDP MLA alleged that people will drive Jagan and YCP leaders out of Andhra Pradesh state
తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు చెయ్యడం వెనుక బాబు ప్లాన్ ఇదే!!

ఏమీ తెలియని అమాయకుడి లాగా ఈరోజు మీడియా ముందుకు వచ్చిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం వింటుంటే తిరుపతి ప్రజలు మండి పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తిరుమల శ్రీవారికి వైవీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎంత సేవ చేశారు అనే విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం అద్దంపడుతోందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

గత ఐదు సంవత్సరాలలో క్రిమినల్ బ్యాచ్ మొత్తం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం చేసిందో తలుచుకుంటేనే భయమేస్తుందని, అది ఊహించడానికే మాకు, శ్రీవారి భక్తులకు చాలా కష్టంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న సిట్ దర్యాప్తులో జగన్ పాపాల పుట్ట పగిలిపోయి అన్ని బయటకు వస్తాయని, ఆరోజు ప్రజల మీకు సరైన బుద్ధి చెబుతారని, జగన్ కు మరో యమగండం త్వరలోనే ఎదురౌతుందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులను, హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+