ఇసుక మాఫియాకు సెల్యూట్, అధికారులకు ఫ్యాంట్ తడిచిపోయింది, లిస్ట్ రెఢీ
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ అధికారులు వైసీపీ ప్రభుత్వం లో ఇసుక వ్యాపారం చేసిన వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు ఫోకస్ పెట్టారు. గతంలో ఇసుక అక్రమాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులకు సైతం ఇప్పుడు దడ మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక గోల్ మాల్ కారణంగా ప్రభుత్వ ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వచ్చింది అని ఆరా తీస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు తల ఊపిన రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అటవి శాఖ అధికారులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు సమాధానం చెప్పలేక నాన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇసుకకు ఎంత డిమాండ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇసుక క్వారీలు మొత్తం ఆసమయంలో వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.

వైసీపీ నాయకులు ఒక్క లోడ్ ఇసుకకు ఎంత ధర నిర్ణయిస్తారో అంతే డబ్బులు పెట్టి ప్రజలు ఆ ఇసుకను కొనుగోలు చేశారు. ఆ ఇసుక కూడా సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఇండ్లు, భవనాలు నిర్మిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక వైసీపీ ప్రభుత్వంలో ఇసుక రీచ్ పాయింట్లు అడ్డాగా చేసుకున్న వైసీపీ నాయకులు చెలరేగి పోయారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పదేపదే ఆరోపించారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలగా ఇసుక బంగారం ధరలు తలపించిందని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఉచిత పంపిణి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఇసుక ప్రజలకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం చేసి ప్రజలను నిలువు దోపిడీ చేసిన వైసీపీ నాయకులు, ఆ పార్టీ నాయకులకు సహకరించిన ప్రభుత్వ అధికారుల వివరాలు సేకరిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు ఆ పార్టీ హైకమాండ్ కు నివేదిక పంపిస్తున్నారని తెలిసింది. ఇసుక దందాలో వైసీపీ కార్యకర్తలు తప్పించుకున్నా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అధికారులను మాత్రం వదిలిపెట్టకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.












Click it and Unblock the Notifications