Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్క సర్వేతో అన్ని పథకాలు… ఏపీలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే షురూ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరొక కుటుంబ సర్వే ను ప్రారంభించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమగ్ర వివరాలను సేకరించడానికి శ్రీకరం చుట్టింది డిసెంబర్ 15వ తేదీ నుండి అంటే నేటినుండి ప్రారంభమైన ఈ సర్వే జనవరి 12వ తేదీవరకు దాదాపు నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ సర్వేలో భాగంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తి వివరాలను సేకరించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వే
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ సర్వే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా UFS మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం నుండి ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత, ఉపాధి వివరాలతో పాటు పలు కీలక సమాచారాలను నమోదు చేస్తారు. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆదాయం, ఆస్తులు, ఇళ్ళ వివరాలు, సామాజిక మ్యాపింగ్ వంటి డేటాను సేకరిస్తారు.

The Unified Family Survey has begun in Andhra Pradesh it is important for government schemes

Take a Poll

నిజమైన లబ్దిదారులకే ప్రభుత్వ పథకాలు
ఆంధ్రప్రదేశ్లో నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా చేర్చడం కోసం ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహిస్తుంది. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను జారీ చేస్తారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుల జారీని సులభతరం చేయడానికి ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రవేశపెట్టే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ సమాచారంపైన ఆధారపడి ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది.

సర్వే విషయంలో ప్రజలలో చాలా సందేహాలు
అంతేకాదు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలలో అనర్హులను గుర్తించడానికి కూడా ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వే విషయంలో చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధినిమిత్తం దూరప్రాంతాలకు వెళ్ళిన వారి వివరాలను ఎలా నమోదు చేస్తారు? వారి అవసరం ఏ మేరకు ఉంటుంది? అన్నదానిపైన ఇప్పటివరకు స్పష్టత లేదు అంతేకాదు సర్వే సమయంలో కుటుంబంలోని అందరూ ఉండాలా లేదా? ఒకరే ఉంటే సరిపోతుందా అనే విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.

సంక్షేమ పథకాలు తీసేస్తారేమో అని పలువురు ఆందోళన
ఈ సర్వేతో సంక్షేమ పథకాలు తీసేస్తారేమో అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఈ సర్వే ద్వారా ఏపీలో ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణ జరుగుతుందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ సర్వేలో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా సచివాలయ ఉద్యోగుల నుంచి వివరాలను తెలుసుకొని, పూర్తి అవగాహనతో సర్వే ప్రక్రియలో సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+