అవాక్కయిన విజయసాయిరెడ్డి! పవన్ గురించి అడిగిన ప్రశ్నకు ఎంపీ పరేషాన్!
అమరావతి/హైదరాబాద్ : తరుచుగా ట్విట్టర్ లో ప్రతిపక్షపార్టీపైన నిప్పులు చెరిగే వైయస్సార్ సీపి ఎంపీ విజయసాయి రెడ్డి విలేఖరుల సమావేశంలో మాత్రం ఖంగుతిన్నారు. ఎప్పుడూ ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తుంటారు విజయసాయి రెడ్డి.

పవన్ ధీటుగా స్పందన
వైసీపీ చేస్తున్న ఆరోపణలు అడ్డుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం చెందారనే చర్చ కూడా టీడిపి శ్రేణుల్లో ఉంది. కానీ వైసీపీకి ప్రతిపక్షపార్టీ టీడిపి కంటే గట్టిగా కౌంటర్లు ఇస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా అడుగేస్తున్నారు ముందు పవన్ కళ్యాణ్ అనే ఆప్షన్ ఏపీలో లేకుండా చేస్తే, ఎలాగూ తమదే మళ్లీ అధికారం అని వైసీపి అడుగులు వేస్తున్నదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అందుకే ఒక్క సీటు మాత్రమే గెలిచిన జనసేనను టార్గెట్ చేసుకొంటూ వైసీపీ విమర్శలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తోందనే మాట బలంగా వినిపిస్తున్నది.

విజయసాయిరెడ్డి ఆరోపణలపై
తాజాగా పవన్ కళ్యాణ్ టీడిపికి దత్తపుత్రుడు అంటూ ప్రచారం చేయడం విజయసాయిరెడ్డి మొదలుపెట్టారు. ఇదంతా వైసీపీ వ్యూహంలో ఒక భాగమనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ ఆరోపణకు సమాధానం చెప్పాల్సింది మాత్రం చంద్ర బాబు, పవన్‌లే. అయితే ఇదే అంశంలో ఓ జర్నలిస్టు చాలా ధైర్యంగా విజయసాయిరెడ్డికి ఒక ప్రశ్న సంధిచారు. ఇంతకీ ఆ జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఏంటంటే, 'మీరు పవన్ ని ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శిస్తారు. ప్యాకేజీ తీసుకున్నారు అని చెప్పడానికి మీ వద్ద ఆధారాలున్నాయా?' అని అడిగారు.

కొన్ని సెకన్లపాటు విజయసాయిరెడ్డి
జర్నలిస్టు అడిగిన ఊహించని ప్రశ్నతో ఎంపి విజయసాయిరెడ్డి ఖంగుతిన్నారు. కొన్ని సెకెన్లు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. తర్వాత తేరుకుని అన్ని ఆరోపణలకు ఆధారాలు ఉండవు. కొన్ని మనస్సాక్షికి తెలిసిపోతాయి అంటూ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పై విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఇన్నాళ్లకు ఒక గట్టి ప్రశ్న ఎదురైంది. దీంతో జర్నలిస్టులు కూడా సమయం సందర్బం దొరికితే తెగింపు చూపిస్తారనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications