వందల కోట్ల భూములు, వైసీపీ ప్రభుత్వంలో ఎలా కొట్టేశారంటే ?, మంత్రి దెబ్బకు మోషన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన గోల్ మాల్ వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను బినామీల పేరుతో వైసీపీ నాయకులు కొట్టేశారని వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలోని సర్వే నెంబర్ 112లో వందల ఎకరాల కొండ భూములను కొట్టేశారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్నూలు జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని మంత్రి బీసీ. జనార్దన్ రెడ్డి హెచ్చరించడంతో వైసీపీకి చెందిన కొందరు నాయకులు, ఆ నాయకులకు సహకరించిన రెవెన్యూ శాఖలోని ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సమాచారం. మంత్రి బీసీ. జనార్దన్ రెడ్డి దెబ్బకు ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులు, అదికారులు ఆత్మరక్షణలో పడ్డారని తెలిసింది.

కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలోని కోట్లాది రూపాయల విలువైన భూముల మీద కన్ను వేసిన కొందరు నాయకులు అప్పటి ఎమ్మెల్యేనే స్వయంగా ఛైర్మన్ గా ఏర్పడిన అసైన్ మెంట్ కమిటీ ద్వారా కొందరు వైసీపీ నాయకులు ఆ భూములు దక్కించుకున్నారని, ఇంకా కొందరు వారి బినామీల పేర్లతో ఆ భూములను దక్కించుకున్నారని వెలుగు చూసింది. కొందరు గ్రామస్థాయి నాయకులు అధికారులను ప్రసన్నం చేసుకుని డి పట్టాలు పొంది ఆ భూములను నొక్కేశారని వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తరువాత గత నాలుగు సంవత్సరాల నుంచి కొందరు వైసీపీ నాయకులు కోట్ల రూపాయల భూములు స్వాహా చేశారని, తరువాత వాటిని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి విక్రయించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆ ప్రాంతం ప్రజలు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మారిపోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విషయం బయటకు రావడంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంబంధిత అధికారులను పిలిచి వివరణ కోరారని తెలిసింది.
అసైన్డ్ భూములను ఎవరెవరికి డి పట్టాల రూపంలో ఇచ్చారు, ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు ఇచ్చారు అని నివేదిక ఇవ్వాలని మంత్రి బిసీ జనార్దన్ రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. మంత్రి బీసీ. జనార్దన్ రెడ్డి ఆదేశాలతో ఇంతకాలం వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేసిన రెవెన్యూ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది వందల కోట్ల విలువైన వందలాది ఎకరాలు కొట్టేసిన నాయకులు ఇప్పుడు ఆ భూముల స్కామ్ నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications