ప్లేటు మార్చారు!: టిపై తగ్గిన దూకుడు, గడువు ఎత్తివేత

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్రం - కాంగ్రెస్ హైకమాండ్ దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై దూకుడు తగ్గించాలని, నిదానమే ప్రధానంగా ముందుకు వెళ్లాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జివోఎం) ఆరు వారాల్లోపు సిఫారసులు సమర్పించాలని అక్టోబర్ 3న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన కేంద్రం, ఇప్పుడు తన వైఖరి మార్చుకుంది.

ఆరు వారాల గడువును ఎత్తివేసింది. జివోఎంకు గడువును కావాలనే ఎత్తివేశామని, వచ్చే ఎన్నికలలోపు తెలంగాణ ఇచ్చేదీ లేనిదీ చెప్పలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. పరిస్థితులు మారుతున్నాయని ఆయన అన్నారు. గడువును ఎత్తివేయడంతో పాటు, జివోఎంలో మంత్రుల సంఖ్యను కుదించడం, అత్యంత కీలకమైన ప్రణాళికాసంఘం, జలవనరులు, మానవ వనరులు, పట్టణాభివృద్ది, న్యాయమంత్రిత్వ శాఖలను చేర్చకపోవడం కూడా కేంద్రంలో సీరియస్‌నెస్ తగ్గిందనే ఆభిప్రాయానికి ఆస్కారం కలిగిస్తోంది.

PC Chacko

తొలి కేబినెట్ నోట్‌లో ఈ మంత్రిత్వ శాఖలన్నీ ఉన్నాయి. ఇక జివోఎం దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రధానమంత్రి స్వయంగా ఈ బృందం పని తీరును పర్యవేక్షించాలని నిర్ణయించారని, అందుకే ప్రత్యేక ఆహ్వానితుడిగా తన కార్యాలయానికి చెందిన మంత్రి నారాయణస్వామిని చేర్చారని అంటున్నారు.

సంప్రదాయానుసారం తెలంగాణ అంశాన్ని రెండుసార్లు అసెంబ్లీ పరిశీలనకు పెట్టాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ తీర్మానం ప్రక్రియను తప్పించామని, కేవలం బిల్లు ముసాయిదాపై అభిప్రాయాన్ని కోరే ప్రక్రియ మాత్రమే ఉంటుందని కేంద్రం మొదట సంకేతాలిచ్చింది. జైపాల్ రెడ్డి తదితరులు కూడా దీన్నే ద్రువీకరించారు. అయితే 'కేబినెట్ నోట్‌పై చర్చ' పేరుతో అసెంబ్లీ నుంచి తీర్మానం కోరాలని కేంద్రం తాజాగా భావిస్తోంది.

రాష్ట్ర విభజనపై కేంద్రం రూపొందించిన కేబినెట్ నోట్‌ను పదిరోజుల్లో అసెంబ్లీకి పంపాలని, దానిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కేంద్రం యోచిస్తోందట. తెలంగాణపై దూకుడుగా వ్యవహరిస్తున్నారని, ఎవరితో చర్చించకుండా, సంప్రదాయాలను విస్మరించి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని కోరాలనే అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేబినెట్ నోట్ ప్రతితో పాటు, జివోఎం ఏర్పాటుపై కేబినెట్ సెక్రటేరియట్ నోట్‌ను బుధవారం నాడే రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+