'రాజధానికి అడ్డంకుల్లేవ్, జగన్ జాతకంతో సీఎం అవుతారా', కొట్లాడుకొని.. కలుస్తాం

గుంటూరు: రాజధాని శంకుస్థాపనకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి గురువారం చెప్పారు. ఏపీ రాజధాని నిన్ననే పర్యావరణ అనుమతులు సూత్రప్రాయంగా వచ్చాయని ఆయన చెప్పారు.

There is no hurdles to Capital foundation: Sujana

జగన్‌కు సీఎం పదవిపై మక్కువ: కళా వెంకట్రావు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి పైన ఉన్న ప్రేమ ప్రజల పైన లేదని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు వేరుగా మండిపడ్డారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి పైనే ధ్యాస అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధికార దాహం, డబ్బు దాహం ఎక్కువైందని మండిపడ్డారు. జగన్ జాతకాలను నమ్ముకొని ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఛీకొట్టినా జగన్‌కు ఏమాత్రం బుద్ధి రావడం లేదన్నారు.

జగన్ పైన అయ్యన్న ఆగ్రహం

ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఎప్పుడు విడిపోతాయా అని జగన్ కాచుక్కూర్చున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. జగన్‌కు రాజకీయాల పైన ఏమాత్రం అవగాహన లేదన్నారు.

ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి దోచుకొని, దాచుకోవడం జగన్‌కు నేర్పించారని ఎద్దేవా చేశారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల మధ్య గొడవల వంటివని అయ్యన్న చెప్పారు. పార్టీలో ఈ రోజు కొట్లాడుకున్నా, రేపు కలుసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+