ఈసారి మోడీ వేవ్ లేదు.. తేల్చేసిన బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్ధి నవనీత్ కౌర్..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ కచ్చితంగా ప్రధాని కావాలని భారతీయులు ముఖ్యంగా ఉత్తర భారతీయులు కోరుకోవడంతో ఆయనకు ఎదురేలేకుండా పోయింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకునేందుకు రెండేళ్లుగా మోడీ పలు వ్యూహాలు రచించారు. అయినా ఇవేవీ పనిచేయడం లేదా ? అంటే చాలా చోట్ల అవుననే సమాధానమే వస్తోంది.
ఈసారి ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని స్వయంగా బీజేపీ నుంచి మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్ధి నవనీత్ కౌర్ రాణా తేల్చిచెప్పేశారు. ఈ మేరకు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి సీటు నుంచే స్వతంత్ర ఎంపీగా గెలిచిన నవనీత్ రాణా ఈ మధ్యే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కానీ పోటీకి వచ్చే సరికి ఆామెకు సీన్ అర్ధమవుతోంది.

తాము ఈ ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పోరాడాలని నవనీత్ కౌర్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లందరినీ బూత్‌కు తీసుకొచ్చి ఓటు వేయమని చెప్పాల్సి వస్తుందన్నారు. మోదీ వేవ్ ఉందన్న భ్రమల్లో ఉండకండని పార్టీ నేతలకు, కార్యకర్తలకు నవనీత్ కౌర్ సూచించారు. గతంలో తాను మోడీ పవనాలు వీచినా తాను స్వతంత్ర ఎంపీగా గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ ఈసారి ఎంత కష్టపడాలో ఆమె తెలిపారు.
బీజేపీ ఎంపీ నవ్ నీత్ కౌర్ వ్యాఖ్యలపై ఎన్సీపీ స్పందించింది. రాణా ఏం మాట్లాడినా అది వాస్తవమని, అది ఆమెకూ తెలుసని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేష్ తపసే తెలిపారు. మోడీ వేవ్ లేదని బీజేపీకే తెలుసన్నారు. విపక్షాలను చీల్చి నేతలను పార్టీలో చేర్చుకున్నప్పుడే బీజేపీకి ఇది అర్దమైందన్నారు.












Click it and Unblock the Notifications