హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మమ్మల్ని చూపి రెచ్చగొడ్తున్నారు: బాబుపై సెటిలర్స్, 'కేసీఆర్‌కు ఆ దమ్ము ఉందా'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సెక్షన్ 8 ఉండాలి కానీ, ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి లేదని సెటిలర్స్ ఫోరం అభిప్రాయపడింది. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హైదరాబాద్ విలువ మరింత పెరిగిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ పాలకులు తమను అడ్డుపెట్టుకొని రెచ్చగొడుతున్నారని వారు ఆరోపించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను వారు ఖండించారు. తెలంగాణ సచివాలయంలో సెటిలర్స్ కోసం ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వారు సూచించారు.

'There is no need of Section 8 now'

ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పే దమ్ము కేసీఆర్‌కు ఉందా: పొన్నాల

ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య గురువారం ప్రశ్నించారు. విభజన సమయంలోనే సెక్షన్ 8 గురించి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు తెలుసునని చెప్పారు. ఓటుకు నోటు కేసుతో ఇద్దరు సీఎంలు పబ్బం గడుపుకునే పనిలో పడ్డారని ఆరోపించారు.

English summary
'There is no need of Section 8 now'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X