సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ‘రాజధాని’ పదమే లేదు.. సీఎం ఉన్నచోటే పాలనా కేంద్రం..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. మండలి రద్దుపై గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన రాజధానుల అంశంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని గురంచి రాజ్యాంగం ఏం చెబుతున్నదో, దాని ప్రకారం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉండాలో ఆయన వివరించారు. సీఎం సంచలన ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆ పదమే లేదు..

ఆ పదమే లేదు..


‘‘శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కేవలం 6 రాష్ట్రాల్లోనే అది ఉందంటే అర్థమేంటి? కన్వీనియన్స్ కోసం.. మేధావుల సలహాల కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. సలహాలు, సూచనలు ఇవ్వకపోగా అదే వ్యవస్థ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితికొస్తే దాని అవసరం ఉందా? లేదా? అని సీరియస్ గా ఆలోచించాలి. ఈ పరిస్థితికి దారితీసిన ఆ రెండు బిల్లులూ ప్రజలకు మేలు చేసేవే. రాజధాని గురించి ఏవేవో మాట్లాడుతున్నవాళ్లు ఒక విషయం తెలుసుకోవాలి. అసలు రాజ్యాంగంలో ‘క్యాపిటల్‘ అన్న పదమే లేదు.

సీట్ ఆఫ్ గవర్నెన్స్

సీట్ ఆఫ్ గవర్నెన్స్

రాజధాని అనే మాటను ఎక్కడా వాడకుండా.. ‘‘సీట్ ఆఫ్ గవర్నెన్స్(పరిపాలించే వ్యక్తి ఉండే చోటు)'' అని మాత్రమే రాజ్యాంగంలో ప్రస్తావించారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందేలా పరిపాలనను వికేంద్రీకరించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ప్రజలే ఇచ్చిన అధికారం. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొనయినా పరిపాలన చేయొచ్చు. పాలనకు ముఖ్యమంత్రే అధిపతిగా ఉంటాడు. కేబినెట్ తోపాటు, సెక్రటరీలూ ఆయనకు సహకరిస్తూ ఉంటారు. దాన్నే సింపుల్ గా సెక్రటేరియట్ అని పిలుస్తారు. దీని ఏర్పాటుకు ఏ చట్టమో, బిల్లో అవసరం లేదు. ఒకే ఒక్క తీర్మానంతో సీఎం ఎక్కడ కూర్చొనయినా పరిపాలన చేయొచ్చు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేనేలేదు. ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీని ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

చట్టాల్లో స్పష్టంగా ఉంది..

చట్టాల్లో స్పష్టంగా ఉంది..

జయలలితగారు బతికున్నప్పుడు ఆమె ఊటి నుంచే పరిపాలన సాగించేవారు. మనకు హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు కూడా పది రోజులు వైజాగ్ లోనే ఉన్నాడు. అంటే పరిపాలన(గవర్నెన్స్) ఎక్కడి నుంచి జరిగింది? రేప్పొద్దున ఇంకెక్కడైనా ప్రకృతి విపత్తు వస్తే ముఖ్యమంత్రులు షిఫ్ట్ కారా? సీఎం ఎక్కడుంటే పరిపాలన అక్కడి నుంచే జరుగుతుంది. ‘‘సీట్ ఆఫ్ గవర్నెన్స్'' ను వికేంద్రీకరించుకునే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చే అధికారం. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చట్టాలు చేస్తూ వ్యవస్థను నడపడమే పరిపాలన. ఇంత స్పష్టంగా చట్టాల్లో ఉన్నప్పటికీ కొందరు ఎందుకీరకంగా యాగీ చేస్తున్నారో వాళ్లే ప్రశ్నించుకోవాలి''అని సీఎం జగన్ అన్నారు. మండలిని రద్దు చేయాలా? వద్దా? అనేదానిపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చిద్దామని ఆయన అనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+