వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో విద్యుత్ కోతలుండొద్దు: బొగ్గు ఎక్కడైనా కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గురువారం రాష్ట్రంలో విద్యతు పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై సీఎం ఆరా తీశారు.

థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయిలో సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన బొగ్గు కొనుగోలు చేయాలన్నారు సీఎం జగన్. ఇందుకు ఎలాంటి నిధుల కొరత లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

 There should be no power cuts in AP: CM YS Jagan review electricity situation.

ఇప్పుడున్న థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని సీఎం జగన్ సూచించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, దీంతో 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురాలని సీఎం జగన్ ఆదేశించారు.

కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎక్కడ విద్యుత్ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండకూడదని తెలిపారు.

శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై సీఎం సమీక్ష

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్‌డేట్‌ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలన్నారు. సర్వే డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.(

సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను సీఎంకు వివరించారు అధికారులు.
పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి
డిసెంబర్‌ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తి
మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్న అధికారులు
జూన్‌ 22, 2022 నాటికి 2400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామన్న అధికారులు
మరో 2400 గ్రామాల్లో ఆగస్టు 2022 నాటికి పూర్తి అవుతుందని వెల్లడి
మొత్తంగా ఆగష్టు 2022 నాటికి 5500 గ్రామాల్లో సర్వే పూర్తయినట్టవుతుందన్న అధికారులు

అక్టోబరు 2022 నాటికి 3 వేల గ్రామాల్లో, మరో 3వేల గ్రామాల్లో డిసెంబరు 2022 నాటికి, మరో 3వేల గ్రామాల్లో మార్చి 2023 నాటికి సర్వే పూర్తి చేస్తామన్న అధికారులు
జూన్, 2023 నాటికి మరో 3 వేల గ్రామాలతో కలుపుని.. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామన్న అధికారులు.

పైలెట్‌ ప్రాజెక్టు సర్వే
పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వే చేశామన్న అధికారులు
3549 పట్టాదారుల వివరాలను అప్‌డేట్‌ చేశామన్న అదికారులు
రెవిన్యూ నుంచి 572 , సర్వే వైపు నుంచి వచ్చిన 1480 అభ్యర్థనలను పరిష్కరించామన్న అధికారులు.
235 సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్న అధికారులు.
సంబంధిత రికార్డులను అప్‌డేట్‌ చేయడమే కాకుండా వాటిని స్వచ్ఛీకరించామని తెలిపిన అధికారులు.
సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నామన్న అధికారులు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు.
క్రయ విక్రయాల సమగ్ర డేటా అప్‌డేట్‌ కావాలి. భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన వ్యక్తి రికార్డుల్లోనూ, కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లోనూ అప్‌డేట్‌ కావాలన్న సీఎం.
అప్పుడే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలి. దీనిపై ప్రత్యేక టీంను పెట్టి.. తగిన విధానాన్ని రూపొందించాలన్న సీఎం. ల్యాండు రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో పెట్టాలన్న సీఎం.
వీరు ఇచ్చిన సిఫార్పుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ ప్రక్రియలకు సంబంధించి ఎస్‌ఓపీలు రూపొందించాలన్న సీఎం. గ్రామ సచివాలయాల్లోనే ఈప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలి: సీఎం ఆదేశాలు. ప్రజలు వీటికోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా తగిన ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశాలు.
ల్యాండ్‌ సర్వేను పూర్తిచేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని సీఎం ఆదేశించారు. తగినన్ని డ్రోన్లు పెట్టుకోవాలన్నారు.

సర్వేకు సంబంధించి డేటా భద్రతపైనా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
దీనిపై అనుభవం ఉన్న వ్యక్తులు, సంస్థలతో మాట్లాడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ల్యాండ్‌ రికార్డుల అప్‌డేషన్‌ను ప్రతి ఏటా ఒక వారంలో చేపట్టాలి.
దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ల్యాండు రికార్డుల అప్‌డేషన్, రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు సీఎం. మనం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఎక్కడా అవినీతికి చోటులేని విధంగా, రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలన్న సీఎం.
సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

Recommended Video

Palamuru-Rangareddy Project:NGT లో బలంగా వాదనలు AP VS TS Govt | Irrigation Projects| Oneindia Telugu

గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశానికి సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 22ఎ కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం. అధికారులు కూర్చొని దీనిపై ఒక విధానం తీసుకురావాలన్నారు. ఇలాంటి తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్న సీఎం. తగినన్ని మార్గదర్శకాలు పటిష్టంగా రూపొందించాలన్న సీఎం. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, ఆ జాబితాలో పెట్టాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలన్నారు సీఎం. దీనికి సంబంధించి ఆధీకృత వ్యవస్థను కూడా బలోపేతంచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

English summary
There should be no power cuts in AP: CM YS Jagan review electricity situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X