ఆశల్లేని పవన్‌కు కొత్తఫ్రెండ్స్, పలుకుబడి: చిరుకి దూరం!

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల్లో పెద్ద పెద్ద ఆశలు లేవట. తాను పదవుల కోసం పార్టీని స్థాపించలేదని పవన్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆయనను తరచి చూసిన వారు కూడా అదే చెబుతున్నారు. రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవుల్లో కొనసాగాలని పవన్‌కు ఏమాత్రం ఆశలు లేవట. కేవలం ప్రజలకు సేవ చేసే విషయం పైనే ఆయన దృష్టి ఉందంటున్నారు.

పవన్‌కు 'ముఖ్య' పదవుల పైన ఆశలు ఉంటే కనుక... ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే పోటీ చేసి ఉండేవారని కానీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలవద్దని, అభివృద్ధి చేయగల్గిన మోడీ, చంద్రబాబులు అధికారంలోకి రావాలని వారి తరఫున ప్రచారం చేశారని ఆయనను సమర్థించే వారు చెబుతున్నారు. కాగా, రాజకీయాల్లోకి రావడం ద్వారా కొత్త అవతారం ఎత్తిన పవన్‌కు కొత్త పరిచయాలు అయ్యాయి! అంతేకాదు వారు అతనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు.

తన సోదరుడు చిరంజీవి పిఆర్పీని స్థాపించినప్పుడు మినహా.. పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే జనసేన పార్టీ స్థాపన తర్వాత రాజకీయంగా పవన్ పలుకుబడి పెరిగింది. పవన్ ప్రచారం చేసిన టిడిపి, బిజెపిలు అధికారంలోకి రావడంతో ఆయనకు ఆ పార్టీలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి. టిడిపి, బిజెపిలు ప్రతి సందర్భంలో ఆయనను గుర్తు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు సినిమాల పరంగా పవన్‌ను 'పవర్ స్టార్' అన్న వారు.. ఇప్పుడు రాజకీయాల్లోను 'పవర్ స్టార్' అంటున్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి తరఫున జోరుగా ప్రచారం చేశారు. దీంతో ఆయన మోడీకి ఆప్తుడిగా మారిపోయారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి తరఫున జోరుగా ప్రచారం చేశారు. పీఆర్పీ తరపున 2009 కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగిన పవన్.. టిడిపిని కూడా టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు ఎపి అభివృద్ధి కోసం ఆయన బాబుతో చేతులు కలిపారు. దీంతో బాబుకు పవన్ విఐపి అయిపోయారు.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సంలో పవన్ పక్కన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూర్చున్నారు. పవన్ సేవాగుణం పట్ల వివేక్ కూడా ముగ్ధుడయ్యారు. పవన్‌తో కలిసి సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు.

 చిరంజీవి

చిరంజీవి

2009లో తన సోదరుడు స్థాపించిన పీఆర్పీ తరఫున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్... దానిని కాంగ్రెసు పార్టీలో కలిపేయడంతో రాజకీయంగా జరిగారు. ఈ నేపథ్యంలో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+