ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు ఫోటోను మరిచారు, ఆగ్రహం
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ అధికారులు శతాబ్ది ఉత్సవాల ఆహ్వాన పత్రికలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను మరిచారు. ఆ ఆహ్వాన పత్రికలో ఏపీ మంత్రులు, మున్సిపల్ అధికారుల ఫొటోలు ఉన్నాయి కానీ, చంద్రబాబు ఫొటో మాత్రం లేదు.
మంత్రులు చినరాజప్ప, నారాయణలతో పాటు తమ ఫోటోలు కూడా మున్సిపల్ అధికారులు వేసుకున్నారు. దీనిపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇది జరిగిందని టిడిపి నేతలు భగ్గుమంటున్నారు.

పెద్దాపురం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆహ్వాన పత్రికను సంబంధింత శాఖాధికారులు తయారు చేశారు. సీఎం చంద్రబాబు పేరు మాత్రం రాసి ఆయన ఫొటో లేకుండా ఈ ఆహ్వాన పత్రికను తయారు చేశారు. ముఖ్యమంత్రి ఫొటో లేకుండా ఇదెట్లా కుదురుతుందని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: కేఈ కృష్ణమూర్తి
కాపు సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో కాపు సంక్షేం, అభివృద్ధి కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేథోమధన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాపుల అభివృద్ధికి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications