Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అడిగితే కోపం: జగన్‌తో మిగిలే ఎమ్మెల్యేల సంఖ్య ఇదేనా?

హైదరాబాద్: ఏపీలో అధికారపార్టీ టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' కు తెరలేపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' వైయస్ జగన్ తన పార్టీ అస్తిత్వాన్నే కోల్పోయేలా చేయనుందా?

నిజానికి వైసీపీ పార్టీ టికెట్‌పై గెలిచి జగన్ వద్ద విధేయులుగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే అధినేత వద్ద ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వైఖరి నచ్చిన మరికొంత మంది ఎమ్మెల్యేలు వలసల బాటబట్టే ప్రమాద ముందంటున్నారు.

సోమవారం వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన్ని నిలదీసేంత పని చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు జగన్ మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయడంతో వారిద్దరిపై జగన్ నాకే ఎదురు చెప్తారా? అంటూ కాస్తంత అసహనానికి గురయ్యారని, సమావేశంనుంచి అర్థంతరంగా వెళ్లిపోయారని సమాచారం.

These are the two mlas irritated ys jagan in meeting

పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం, వారితో సఖ్యతగా ఎలా మెలగాలనే దానిపై జగన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వబోగా ఆయనకు కోపం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే జగన్‌కు కోపం తెప్పించేలా ప్రవర్తించిన ఆ ఇద్దరూ ఎమ్మెల్యేల్లో ఒకరు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాగా, మరొకరు కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అని తెలుస్తోంది.

తొలుత శ్రీనివాసరెడ్డి, జగన్‌కు సలహాలు చెప్పడం ప్రారంభించాడని, ఒక రకంగా జగన్‌ను నిలదీసినట్లుగానే ఆయన మాట్లాడుతుండగా జగన్‌కు కోపం వచ్చిందని అంటున్నారు. జగన్ ఆయనకు ఏదో చెప్పబోయే సమయానికి, ప్రతాప్‌కుమార్‌ రెడ్డి కూడా లేచి ఎమ్మెల్యేల పట్ల జగన్‌ వ్యవహారశైలి గురించి మాటలు అన్నట్లు సమాచారం.

దాంతోనే జగన్ కోపం వచ్చి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు. అయితే జగన్ తీరు వల్లే కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి జగన్ నిర్వహించిన సమావేశానికి వైసీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు గైర్హజరయ్యారు.

These are the two mlas irritated ys jagan in meeting

వచ్చిన వారిలో ఇద్దరు జగన్ మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం అధికారపార్టీ తీరును చూస్తుంటే సాధ్యమైనంత వరకు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. మరో 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారనే అనుమానానికి తావిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే చివరకు వైసీపీలో మిగిలేది జగన్‌తో కలిపి 44 మందేనన్నమాట. ఉదయం పూట జగన్‌తోనే ఉంటామని చెప్పిన ఎమ్మెల్యేలు సాయంత్రానికి టీడీపీలోకి చేరిపోతున్నారు.

ఇదే జగన్‌కు మింగుడు పడని విషయం. ఇప్పటికైనా వైయస్ జగన్ మేల్కొని పార్టీ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అంతేకాదు ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండి, పార్టీ లోపాల గురించి అంతర్గత వేదికల మీద మాట్లాడుకుంటే ఇంకా మంచిది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+