వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి తాను నడుస్తానో లేదో చెప్పలేనని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ శుక్రవారం అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాబుకు 'ఆదినారాయణరెడ్డి' దెబ్బ, షాకైన జగన్‌లో కొత్త హుషారు: టీడీపీ ఆందోళనబాబుకు 'ఆదినారాయణరెడ్డి' దెబ్బ, షాకైన జగన్‌లో కొత్త హుషారు: టీడీపీ ఆందోళన

పవన్ కళ్యాణ్ జేఏసీని జేఎఫ్‌సిగా ఎందుకు మార్చారో తనకు తెలియదని చెప్పారు. జనసేనతో కలిసి నడుస్తానో లేదా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. పవన్ స్థిరంగా రాజకీయాలు చేయడం ముఖ్యం కాదని, ప్రశ్నించడం ముఖ్యమన్నారు.

 పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ముఖ్యం

పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ముఖ్యం

ప్రభుత్వాలను ప్రశ్నించే బాధ్యత కేవలం రాజకీయ పార్టీలదే కాదని, పౌరులుగా మనందరి బాధ్యత కూడా అని జేపీ అన్నారు. పవన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలపై జేపీ స్పందిస్తూ.. రాజకీయం ఇలాగే చేయాలని, ప్రధాని అయితేనే చేయాలని ఎక్కడా లేదని చెప్పారు. ప్రజలుగా కూడా మనం స్పందించవచ్చునని చెప్పారు. ప్రశ్నించడం ముఖ్యమన్నారు.

ప్రపంచంలోనే అద్భుత నగరం కావాలి కానీ

ప్రపంచంలోనే అద్భుత నగరం కావాలి కానీ

ప్రపంచంలోనే అయిదో అద్భుత నగరం కావాలని చంద్రబాబు చెబుతున్నారని, అది కావాలని తాను కోరుకుంటున్నానని జేపీ అన్నారు. ఏపీకి గౌరవప్రదమైన రాజధాని కావాలని, కానీ ఒక్కదాని పైనే దృష్టి పెట్టవద్దన్నారు. తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవని, ఉపద్రాలు రావని, తాను చెప్పానన్నారు.

నేను రాజకీయం చేస్తున్నా

నేను రాజకీయం చేస్తున్నా

తాను ఫక్తూ నిరంతరం రాజకీయం చేస్తున్నానని జేపీ చెప్పారు. రాజకీయం అంటే వారికి అర్థం తెలియదన్నారు. నేను మాత్రం నిరంతరం రాజకీయం చేస్తున్నానని చెప్పారు. ఓట్లు, సీట్లు రాజకీయం కాదని అభిప్రాయపడ్డారు. పది శాతం ఓట్లు వస్తే లోక్‌సత్తా పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో కోదండరాం నేతృత్వంలో రానున్న కొత్త పార్టీ పైన కూడా జేపీ స్పందించారు.

 మోడీ బలం తగ్గడంపై

మోడీ బలం తగ్గడంపై

ప్రధాని మోడీ బలం తగ్గుతుందని, రాహుల్ గాంధీ బలం పెరుగుతుందని వార్తలు రావడంపై జేపీ స్పందిస్తూ.. బలమైన ప్రతిపక్షం ఉండాలన్నారు. ఏపీ విషయంలో కేంద్రం మనకు దయాదాక్షిణ్యాలతో ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. హక్కుగా మనకు రావాల్సినవే అన్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో వివాదాలు ఉన్న వాటిపై మాట్లాడి పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.

English summary
Lok Satta Jayaprakash Narayana on Friday said that some people don't know the meaning of politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X