దొంగలు బీభత్సం: మహిళను తాళ్లతో కట్టేసి ఇంట్లోని బంగారం అపహరణ
అమరావతి: కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మచిలీపట్నంలోని శుకర్లాబాద్‌లో ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న రామసునీత (45) అనే మహిళను దొంగలు తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుతో పాటు ఆమె ఒంటిపై ఉన్న బంగారన్ని కూడా అపహరించారు.
రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వచ్చిన బంధువులు సునీత అపర్మారక స్థితిలో ఉండటం గమనించి ఆమెను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. సునీత సృహలోకి వస్తేగానీ అసలేం జరిగిందనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
కర్నూలులో ఆర్టీసీ బస్సు బోల్తా
కర్నూలు జిల్లాలోని అవుకు జలాశయం సమీపంలోని కాలువలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆదివారం ఉదయం విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది.
బస్సు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులోంచి ప్రయాణికులను రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు.
వినుకొండకు చెందిన 26 మంది ప్రయాణికులు హిందూపురం సమీపంలో చేపట్టిన రహదారి నిర్మాణపనులకు వెళ్తుండగా, మిగిలిన వారు వివిధ ప్రాంతాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న బనగానపల్లి ఆర్టీసీ డిపో మేనేజరు శశి భూషణ్‌రావు, అవుకు ఎస్సై వెంకట్రామిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications