హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ కీతో ఎన్నారై ఇంట్లో చోరీ, జగన్ పార్టీ నేత హత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చంద్రఘాట్‌లోని కాలా డేరాలో ఓ ఎన్నారై ఇంట్లో చోరీ జరిగింది. ఈ సంఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే పోలీసుల తెలిపిన సమాచారం మేరకు దుండగులు నకిలీ కీతో ఇంటి అలమారాని తెరిచి ఇంట్లో ఉన్న డబ్బుతో పాటు లక్షల విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పిడింది సమీప బంధువులేనని పోలీసులు భావిస్తున్నారు.

"ఈ సంఘటన జరిగినప్పుడు ఇంటి ఓనర్ మహామ్మద్ రెహమాన్ ఖాన్‌తో సహా కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఉదయం 8.30 ప్రాంతంలో ఈ చోరీ జరిగిందన్నారు. ప్రధాన ద్వారాన్ని నకిలీ కీతో తెరిచి సుమారు 500 గ్రాముల బంగారంతో పాటు, లక్ష రూపాయల నగదును తీసుకెళ్లారు. వారు ఇంట్లో ఏ సామగ్రికి కూడా హాని లేదు" అని డిటెక్టివ్ ఇనెస్పెక్టర్ ధీరావత్ హుస్సెన్ తెలిపారు.

Thieves steal gold and cash from NRI’s house

గత 20 రోజులుగా మహామ్మద్ రెహమాన్ ఖాన్‌తో సహా కుటుంబ సభ్యులు పెళ్లిలో బిజీగా ఉన్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు వీరి ఇంటిని సందర్శించడం జరిగింది. వారి బంధువుల్లోనే ఎవరైనా ఈ చోరికి పాల్పడి ఉంటారనే అనుమానం ఉందని పోలీసులు తెలిపారు. మహామ్మద్ రెహమాన్ ఖాన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరి అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, త్వరలోనే ఈ కేసుని చేధిస్తున్నామన్నారు.

సర్పంచి దారుణ హత్య

అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనుమాపురం సర్పంచి విశ్వనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. సర్పంచిని దుండగులు గ్రామంలోనే రివాల్వరుతో కాల్చి చంపారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా, హత్య గావించబడ్డ సర్పంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నేతగా తెలుస్తోంది.

వృద్ధుడు మృతి

హైదరాబాదులో బస్సు దిగుతూ ఓ వృద్ధుడు మృతి చెందాడు. భారీ వర్షాల కారణంగా నగరంలో రోడ్ల పైన నీరు నిలిచింది. దీంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బేగంపేట వద్ద సింద్ కాలనీ వైపు మళ్లించారు. సింద్ కాలనీ నుండి వెళ్తున్న బస్సులో ఓ వృద్దుడు తాను దిగాల్సిన స్టాప్ దాటిపోతుందని దిగాడు. అయితే, అతను వెనుక టైరు కింద పడి మృతి చెందాడు.

English summary
Burglars broke into an NRI’s house at Kala Dera in Chaderghat early on Saturday and fled with cash and gold worth several lakhs. The culprits used a duplicate key to open the almirah. Cops suspect a relative who used to frequent the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X