తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు రోజులు రద్దు.. ఎందుకు, ఎప్పుడు అంటే

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలతో వచ్చే వారికి టీటీడీ ఒక అలెర్ట్ ఇచ్చింది. ఆ నాలుగు రోజులు సిఫార్సు లేఖలతో రావొద్దని, వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నవంబరు నెలలో మూడు రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నవంబర్ 13, 14 ,15 తేదీలలో మూడు రోజులపాటు విఐపి బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

నవంబర్ 13, 14,15 తేదీలలో విఐపి దర్శనాలను రద్దు చేసిన టీటీడీ

నవంబర్ 13, 14,15 తేదీలలో విఐపి దర్శనాలను రద్దు చేసిన టీటీడీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల తాకిడి పెరుగుతుండడంతో పాటుగా, విఐపిల తాకిడి కూడా నిత్యం పెరుగుతున్న క్రమంలో వీఐపీలకు షాక్ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ మూడు రోజుల్లో తిరుమలకు వచ్చే వీఐపీలకు స్వామివారి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వారు తిరుమలకు రావొద్దని సూచిస్తుంది. ఇంతకీ నవంబర్ 13, 14,15 తేదీలలో విఐపి దర్శనాలను రద్దు చేయడం వెనుక కారణాన్ని చూస్తే 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది.

 ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరు కానున్న హోం మంత్రి అమిత్ షా

ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరు కానున్న హోం మంత్రి అమిత్ షా

ఇక ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారుల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కారణంగా, సిఫార్సు లేఖలతో వచ్చేవారు ఆ మూడు రోజుల్లో రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు టీటీడీ అధికారులు. 12, 13,14, 15 తేదీలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, అలాగే 12, 13, 14 తేదీలలో వీఐపీ దర్శనాల లేఖలు అనుమతించబడవని తెలిపారు.

కరోనా కాలం నుండి క్రమంగా మెరుగవుతున్న స్వామి వారి హుండీ ఆదాయం

కరోనా కాలం నుండి క్రమంగా మెరుగవుతున్న స్వామి వారి హుండీ ఆదాయం

ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారిని శనివారం నాడు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి దర్శన ప్రారంభ సమయంలో స్వామి వారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సుధ, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ట్, తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ,సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు గోపీచంద్ తదితరులు దర్శించుకున్నారు. ఇక మరోవైపు కరుణవల్ల ఖాళీ అయిన స్వామివారి ఖజానా ఇప్పుడిప్పుడే మళ్లీ నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తుల సంఖ్య పెంచుతూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకోవడంతో స్వామివారి హుండీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది.

 అక్టోబర్ నెలలో ఆదాయం ఇలా .. నవంబర్ లోనూ పెరగనున్న హుండీ ఆదాయం

అక్టోబర్ నెలలో ఆదాయం ఇలా .. నవంబర్ లోనూ పెరగనున్న హుండీ ఆదాయం

అక్టోబర్ నెలలో వెంకటేశ్వర స్వామి వారిని 8,12,818 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 3,77,970 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 79 కోట్లకుపైగా తిరుమల స్వామి వారికి అక్టోబర్ నెలలో హుండీ ఆదాయం లభించింది. ఇదిలా ఉంటే నవంబర్ డిసెంబర్ నెలలలో కూడా ఆదాయం పెరుగుతుందని భావిస్తుంది.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు రోజుకు పన్నెండు వేలు, సర్వ దర్శనం టోకెన్లు పదివేలు చొప్పున పెంచిన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి హుండీ ఆదాయాన్ని పెంచడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+