తీరం మనదే.. బోటు మనదే.. వేటా మనదే! సీఎం పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్

సముద్రంలో చేపల వేట అనేది కేవలం వృత్తి కాదు, అదొక సాహసంతో కూడిన పని అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. మత్స్యకారులు తమ జీవనోపాధి కోసం రోజుల తరబడి సముద్రంలోనే గడుపుతుంటారని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో జరిగిన 'మత్స్యకారుల సేవలో' బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా తుమ్మలపెంట గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధ సమయం ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో మత్స్యకారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ మత్స్యకార కుటుంబానికి కేవలం 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశామని, కానీ మళ్లీ కూటమి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సాయాన్ని ఏకంగా రూ.20 వేలకు పెంచి ఇస్తున్నామని ప్రకటించారు.

This Coast Is Ours Boat Is Ours And Fishing Is Ours Warns Neighboring States AP CM Chandrababu

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,30,796 మత్స్యకారుల కుటుంబాలకు రూ.20 వేల చొప్పున, మొత్తంగా రూ.262 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చంద్రబాబు వెల్లడించారు. మన సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్యకారులు వేటపైనే ఆధారపడి బతుకుతున్నారని, వారి సంక్షేమం గురించే తమ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుందని చెప్పారు. ఈ తీరం మనది, బోటూ మనదే, వేటా మనదే!.. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. ఇదే ఈ సీబీఎన్ మాట అని స్పష్టం చేశారు.

పారిశ్రామికాభివృద్ధి.. బుల్లెట్ స్పీడ్‌లో పాలన

రాష్ట్రంలో వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత అత్యధిక మంది ఉపాధి పొందుతున్నది ఒక్క మత్స్యసంపద పైనేనని సీఎం గుర్తుచేశారు. దేశంలోనే చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని, అయితే 2019-24 మధ్య కాలంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేపల ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మత్స్యకారుల కోసం మెకనైజ్డ్, మోటరైజ్డ్ డీజిల్ పడవలకు లీటరుకు రూ.9 మేర డీజిల్ సబ్సిడీ ఇస్తోందని, ఇందులో భాగంగానే 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల విలువైన డీజిల్ సబ్సీడీని అందించామని తెలిపారు.

ఖరీఫ్‌కు నీటి విడుదల, ఇరిగేషన్ క్యాలెండర్ తో పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్!
ఖరీఫ్‌కు నీటి విడుదల, ఇరిగేషన్ క్యాలెండర్ తో పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్!

మత్స్యకారుల కోసం రూ.3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. దీనిపై కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అలాగే మత్స్యకారుల భద్రత కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసి అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. పడవలు, వలలు, పరిహారం వేటినీ ఆలస్యం చేయకుండా సకాలంలోనే ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల బోట్లు మన తీరంలోకి రాకుండా గట్టి నిఘా పెడతామని, మన వారి హక్కులను కాపాడతామని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల కోసం 60 శాతం సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తున్నామని, మిగిలిన మొత్తాన్ని సులువైన వాయిదాల్లో రుణంగా చెల్లించేలా బ్యాంకుల ద్వారా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

నేనే మీ మార్కెటింగ్ మేనేజర్‌ని!

ప్రపంచవ్యాప్తంగా చేపలకు మంచి పౌష్టికాహారంగా, అత్యధిక ప్రోటీన్లు ఉన్న ఆహారంగా గిరాకీ ఉందని సీఎం అన్నారు. "మత్స్యకారులు పండించే చేపలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గిరాకీ సృష్టించేలా, అంతర్జాతీయ వేదికలపై నేనే స్వయంగా ఒక మార్కెటింగ్ మేనేజర్‌గా వ్యవహరిస్తాను" అని చంద్రబాబు ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అద్భుతమైన అభివృద్ధి వస్తుందని, ఆ అభివృద్ధిని మత్స్యకారులు కూడా అందుకునేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.

రోడ్లపై నమాజ్ చేస్తే..! సీఎం వార్నింగ్ వీడియో
రోడ్లపై నమాజ్ చేస్తే..! సీఎం వార్నింగ్ వీడియో

రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు నీళ్లతో నిండుగా ఉన్నాయని, అక్కడ చేపల పెంపకం చేపట్టి, ఆ సంపదను విక్రయించుకునే పూర్తి హక్కులను మత్స్యకారులకే అప్పగించామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో 'సాగర్ డిఫెన్స్' సంస్థ ఏర్పాటు అవుతుంటే కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని, దీని ద్వారా స్థానిక యువతకే పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని క్లారిటీ ఇచ్చారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చేపలు ఎక్కడ ఎక్కువగా లభిస్తాయో శాటిలైట్ సమాచారాన్ని కూడా అందిస్తున్నామన్నారు. అలాగే ఆక్వా కల్చర్ అభివృద్ధి కోసం ఒక్కో యూనిట్‌కు కేవలం రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు.

టెక్నాలజీ అండ్ కొత్త ఉపాధి: సీవీడ్ కల్చర్

చేపల వేటతో పాటు మత్స్యకారులు కొత్త సాంకేతికతను కూడా అందుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే 'సీవీడ్ కల్చర్' (సముద్రపు నాచు పెంపకం) అనే సరికొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తున్నామన్నారు. మత్స్యకార మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు దీని ద్వారా అదనపు ఆదాయం సాధించేలా చర్యలు చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. మత్స్యకార యువతకు అధునాతన నైపుణ్యాలు (Skills) నేర్పించి వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు.

AP Govt: ఏపీలో రేపు వారి ఖాతాల్లో 20 వేల జమ..! పూర్తి వివరాలివే..!
AP Govt: ఏపీలో రేపు వారి ఖాతాల్లో 20 వేల జమ..! పూర్తి వివరాలివే..!

నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, పారిశ్రామికంగా జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని 25 మత్స్యకార గ్రామాలను అనుసంధానం చేస్తూ మెటల్ రోడ్లు వేస్తామని ప్రకటించారు. నార్త్ బకింగ్ హామ్ కెనాల్ డీసిల్టింగ్ (పూడికతీత) పనుల కోసం రూ.6.19 కోట్లను మంజూరు చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ కాలువను 'ఇన్ ల్యాండ్ వాటర్ వేస్' (అంతర్గత జల రవాణా మార్గం)గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారు

టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారని, బీసీలకు-తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల అనుబంధం ఉందని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. గత 45 ఏళ్లుగా బీసీలు టీడీపీని ఆదరించారని, వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు. బీసీ సంక్షేమంలో భాగంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల వేతనం అందిస్తున్నామని, వడ్డెర్లకు, గీతకార్మికులకు గనులు, మద్యం దుకాణాల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

వైసీపీ విధ్వంసం.. ఆ 'గొడ్డలి పార్టీ' కుట్రలు!

గత వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ఎక్కడా అభివృద్ధి చేయకుండా, సంక్షేమాన్ని కూడా సరిగ్గా అందించకుండా రాష్ట్రాన్ని వెనక్కు లాగారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వైసీపీ చేసిన దారుణమైన విధ్వంసాన్ని సరి చేయడానికే తమకు 23 నెలల సుదీర్ఘ సమయం పట్టిందని, ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రజా ప్రభుత్వం ఇంతగా సంక్షేమం చేస్తుంటే, రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ ఒక 'గొడ్డలి పార్టీ' లేనిపోని కుట్రలు, ఫేక్ ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి వరకూ వరుస హత్యలు చేస్తూ రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేసిన చరిత్ర వారిదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కేవలం ప్రజల సేవకులమేనని, ప్రతీ ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలనే కఠినమైన లక్ష్యాన్ని పెట్టామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+