రాజమౌళి 'బాహుబలి' చూపిస్తే, చంద్రబాబు రాజధాని సినిమా: రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని బృహత్తర ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా మగధీర, బాహుబలి సినిమాలతో పోల్చారు.
రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్ తేజ హీరోగా మగధీర, ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాలు వచ్చాయి. వీటితో రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ామె పోల్చారు.
ఆ రెండు సినిమాలలో వలె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఓటుకు నోటు కేసు, గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలలో తన పాత్రను ప్రజలు మరిచిపోవాలనే చంద్రబాబు ఈ కొత్త సినిమా చూపిస్తున్నారన్నారు. పుష్కరాలలో ప్రచారం కోసం సినిమా తీయించేందుకు జనాన్ని పోగు చేసి తొక్కిసలాట జరిగేందుకు చంద్రబాబే కారణం అయ్యారని ఆరోపించారు.
వాటిని జనం మర్చిపోవాలనే ఈ రాజధాని వీడియోలు పదేపదే చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన సినిమా చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో, ఓ సామాజిక వర్గమో సంతోషించినా ప్రజలకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడదన్నారు. రాజధాని ప్రణాళికలో సామాన్యులకు, మధ్య తరగతి వారికి చోటు ఎక్కడ అన్నారు.












Click it and Unblock the Notifications