జగన్ పై ఢిల్లీ అభిప్రాయం ఇదీ: ఢిల్లీలో బాణం ఎక్కుపెట్టిన జనసేనాని పవన్

వైసీపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇసుక విషయంలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై గళం ఎత్తిన జనసేనాని... ఆ తర్వాత జగన్ సర్కార్ తీసుకున్న ఇంగ్లీష్ మీడియం చదువుల నిర్ణయంను తప్పుబట్టారు. ఇక తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ "జగన్‌ పై ఢిల్లీ అభిప్రాయం ఇది" అంటూ ఓ కార్టూన్‌ను ట్విటర్‌లో పోస్టు చేశారు.

ట్విటర్ వేదికగా సీఎం జగన్‌ను టార్గెట్ చేసిన పవన్

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్‌ను మరోసారి టార్గెట్ చేశారు. ఇప్పటికే పలు అంశాలపై టార్గెట్ చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా ట్విటర్ ద్వారా మరోసారి విమర్శలు గుప్పించారు. ఓ జాతీయ పత్రిక ప్రచురించిన కార్టూన్‌ కటింగ్‌ను ట్విటర్‌లో పోస్టు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ పై ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయం ఉందంటూ పేర్కొన్నారు.

కార్టూన్‌లో ఏముంది..?

కార్టూన్‌లో ఏముంది..?

ఇక జాతీయ పత్రిక ముద్రించిన జగన్‌ కార్టూన్‌లో రెండు కాళ్లకు రెండు బస్తాలు కట్టి ఉండగా ఒక కాలుకు కట్టి ఉన్న బస్తాలో శాండ్ (ఇసుక) అని రాసి ఉంది. మరో బస్తాపై ఎలాంటి రాతలు లేవు. ఇదే కార్టూన్‌ను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే ఇసుకు విధానం గురించే ఆ పత్రిక చెప్పాలనుకుంటుందనేది కార్టూన్‌ ద్వారా స్పష్టమవుతోంది.

కార్మికుల ఆత్మహత్యలకు కారణం వైసీపీ సర్కార్

కార్మికుల ఆత్మహత్యలకు కారణం వైసీపీ సర్కార్

175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపిస్తే వచ్చిన ఐదునెలల సమయంలోనే 35 లక్షల మంది భవననిర్మాణ కార్మికుల ఉపాధిని జగన్ సర్కార్ తొలగించిందని మండిపడ్డారు. 50 మంది కార్మికుల ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వం కారణమైందని ట్విటర్‌లో విరుచుకుపడ్డారు.

Recommended Video

    Pawan Kalyan Sensational Comments On YS Jagan During Opening Of Dokka Seethamma Aahara Sibiralu
     మరో జాతీయ దినపత్రిక కటింగ్‌ను పోస్ట్ చేసిన పవన్

    మరో జాతీయ దినపత్రిక కటింగ్‌ను పోస్ట్ చేసిన పవన్


    ఇక కార్టూన్ ట్వీట్ చేసిన మరికొన్ని నిమిషాలకే మరో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. మరో జాతీయ దినపత్రిక ఏపీ ప్రభుత్వం గురించి రాసుకొచ్చిన ఎడిటోరియల్ పేపర్ కటింగ్‌ను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ పరిపక్వత లేని రాజకీయాలకు తెరదీశారని ట్వీట్‌లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీని స్ట్రాంగ్‌గా టార్గెట్ చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాంగ్ మార్చ్‌తో ప్రారంభమైన అటాక్ భవిష్యత్తులో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+