మోడీ, అమిత్ షా లోకేష్ కు అపాయింట్మెంట్ అందుకే ఇవ్వలేదు: మంత్రి రోజా!!

టిడిపి అధినేత చంద్రబాబుపై, వైసిపి మంత్రి (minister roja) రోజా మరోసారి విరుచుకుపడ్డారు. నారా లోకేష్( nara lokesh) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ (pm narendra modi), హోం మంత్రి అమిత్ షా (home minister amit shah) కాళ్లు పట్టుకోవడం కోసం తిరుగుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు.

అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడడానికి ఎవరు సిద్ధంగా లేరని అందుకే మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇక రాష్ట్రపతిని కలిసిన లోకేష్ ( lokesh met president) తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని, ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదని అడగడం కోసం ఢిల్లీ వెళ్లారని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

lokesh

చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాములు జరిగాయని మంత్రి రోజా పేర్కొన్నారు. స్కాములలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడని, కాళ్ళ నుంచి కళ్ళ వరకు భయంతో వణికి పోతున్నాడని రోజా ఎద్దేవా చేశారు. అసలు రోడ్డే వెయ్యలేదు కదా ఇంకా స్కామ్ ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నాడని, రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని మంత్రి రోజా టార్గెట్ చేశారు.

మరో ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రోజా పేర్కొన్నారు. రెడ్ బుక్ రాసుకుంటాను అని బెదిరిస్తున్న లోకేష్ సిఐడి మెమోలో ఆయన పేరు రాసుకున్నారు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్మితే 400 కోట్ల రూపాయలు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారని, అంటే చంద్రబాబు మొత్తం ఆస్తి 20వేల కోట్ల రూపాయలా అంటూ ప్రశ్నించారు.

Minister Roja

చంద్రబాబు అఫిడవిట్లో ఆ విషయం స్పష్టం చేశారా అంటూ ప్రశ్నించారు. ఖర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరొక ఎకరం ఇచ్చారని, అలాంటప్పుడు చంద్రబాబుకు అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా అబద్దాలు చెబుతుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందని పేర్కొన్నారు. చంద్రబాబు దోపిడీ దారుడని పేర్కొన్న రోజా, చంద్రబాబు టీం వర్క్ గా కుటుంబ సభ్యులంతా దోపిడీలోభాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+