చంద్రబాబుకు త్రిమూర్తులు జలక్..! అధినేత ఆదేశాలు బేఖాతర్ : పార్టీ వీడటం ఖాయమా..!
తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత..రామచంద్రాపురం టిడిపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇప్పుడు టిడిపి లో ఉంటారా లేక వైసిపి లోకి వెళ్తున్నారా అనే దాని పై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాను పార్టీ వీడాల్సిన అవసరం లేదంటూనే కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని మరింత ఆసక్తి పెంచారు. ఇదే సమయంలో అధినేత ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆయన తాజాగా నడిపిన మంత్రాంగం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది..
తలసాని తో త్రిమూర్తులు భేటీ..
టిడిపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ వచ్చిన త్రిమూర్తులు మంత్రి తలసాని తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. 2014 ఎన్నికల్లో తనను ఓడించటానికి ప్రయ త్నించిన టిడిపి అధినేత చంద్రబాబు పై రాజకీయంగా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని తలసాని ఇప్పటికే ప్రక టించారు. తాజాగా రెండు సార్లు ఏపి పర్యటనకు వెళ్లిన తలసాని అక్కడ చంద్రబాబు..ఆయన ప్రభుత్వ తీరు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. దీంతో..చంద్రబాబు సీరియస్ అయ్యారు.

టిడిపిలో ఎవరూ కూడా తలసాని కార్యక్రమాల్లో పాల్గొన వద్ద ని..బంధుత్వాలు ఉంటే అవి పార్టీ తరువాతేనని స్పష్టం చేసారు. దీంతో..రెండో సారి తలసాని పర్యటన లో ఆయన సామా జిక వర్గం వారు మినహా పార్టీ నేతలు పాల్గొన లేదు. అయితే, తాజాగా తోట త్రిమూర్తులు నేరుగా హైదరాబాద్ లో తలసాని నివాసానికి వెళ్లి మరీ చర్చలు జరపటం ఇప్పుడు టిడిపిలో కొత్త చర్చకు కారణమైంది.
మర్యాద పూర్వక సమావేశమేనా..
చీరాల ఆమంచి కృష్ణ మోహన్ సైతం పార్టీ మారటానికి మందుగా చర్చలు జరుగుతున్న సమయంలో తూర్పు గోదావ రి జిల్లా వెళ్లి తోట త్రిమూర్తులతో సమావేశమయ్యారు. ఆ తరువాత త్రిమూర్తులు సైతం పార్టీ మారుతున్నారనే ప్రచా రం జరి గింది. ఆ సమయంలో వారిద్దరూ కాపు రిజర్వేషన్లు..ఏపిలో రాజకీయాల పై చర్చించుకున్నట్లు సమాచారం. త్రిమూర్తులు ఇంట్లో జరిగిన శుభకార్యానికి తెలంగాణ మంత్రి తలసాని సైతం హాజరయ్యారు.
ఇప్పుడు తాను హైదరా బాద్ వచ్చినందుకు..తలసాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో..కేవలం స్నేహితుడుగా..మర్యాద పూర్వకంగా కలిసేందుకు మాత్ర మే వచ్చానని..ఇందులో రాజకీయాలు లేవని త్రిమూర్తులు చెబుతున్నారు. అయితే, త్రిమూర్తులు వైసిపి నేతలతొ టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా తలసాని తో నేరుగా సమావేశం అవ్వటం పై ఆయన మర్యాదపూర్వక సమావేశం అని చెబుతున్నా..దీని వెనుక త్రిమూర్తులు ఇక టిడిపిని వీడటంలో భాగంగానే అడుగులు పడుతున్నాయనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications