చంద్రబాబు సొంత జిల్లాలో షాక్, బాబు, పెద్దిరెడ్డి, రోజా ఊరిలో వేలలో నోటా ఓట్లు, గుద్దేశారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీతో పాటు స్వతంత్ర పార్టీ అభ్యర్థుకు ఓట్లు వేశారు. అన్ని పార్టీల గుర్తుల మీద ఓటు వేసిన ప్రజలు అదే సమయంలో కొన్ని వేల మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా వేలాది మంది ఓటర్లు నోటా ఓట్లు వేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పలు నియోజక వర్గాల్లో నోటాకు తక్కువ ఓట్లు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో హోరాహోరీగా సాగుతాయని భావించిన సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా సాగిపోయాయి. చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజక వర్గం తప్పా మిగిలిని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒక్కరే చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి చిత్తూరు జిల్లాలో కొన్ని వేలు తక్కువగా నోటా ఓట్లు పోలైనాయి. గతంలో కంటే ఇప్పుడు మాజీ మంత్రి రోజా పోటీ చేసిన నగిరి నియోజక వర్గంలో 66 నోటా ఓట్లు ఎక్కువగా పోలైనాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగిరిలో 1,688 నోటా ఓట్లు పోలైతే ఇప్పుడు 1,744 నోటా ఓట్లు పోలైనాయి. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో వేల సంఖ్యలో నోటా ఓట్లు పోలైనాయి.
మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో 2,115, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చేసిన పుంగనూరులో 2,904 నోటా ఓట్లు, మాజీ మంత్రి రోజా పోటీ చేసిన నగిరిలో 1,744, మాజీ మంత్రి ఎన్. అమరనాథ రెడ్డి పోటీ చేసిన పలమనేరులో 2,344 నోటా ఓట్లు, చిత్తూరులో1,096 నోటా ఓట్లు, జీడీ నెల్లూరులో 2,125 నోటా ఓట్లు, పూతలపట్టులో 1,430 నోటా ఓట్లు పోలైనాయి.

చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 16,713 నోటా ఓట్లు పోలైతే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13,748 నోటా ఓట్లు పోలైనాయి. గతంలో నోటా ఓట్లు ఎక్కువగా వేసిన చిత్తూరు జిల్లా ప్రజలు ఈసారి మాత్రం మనసు మార్చుకుని ఏదో ఒక పార్టీకి ఓటు వేసినట్లు ఉన్నారు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటా ఓట్లు ఎక్కువగాపడ్డాయి.












Click it and Unblock the Notifications