TTD: దర్శనం, అర్జిత సేవా టిక్కెట్ల గోల్ మాల్, ఒకే ఫోన్ నెంబర్ తో వేలల్లో టిక్కెట్లు బుక్

కలియుగ వైకుంఠదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో దర్శన టిక్కెట్ల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని టీటీడీ ఈవో జే శ్యామలరావు గుర్తించారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, అర్జిత సేవా టిక్కెట్లు ఒకే ఫోన్ నెంబర్ తో ఎక్కువ టిక్కెట్లు పొందారని టీటీడీ ఈవో ఐటీ విభాగం సిబ్బంది పరిశీలనలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది

గత ఏడాది అంటే 2023లో వంద ఫోన్ నెంబర్లతో అధిక సంఖ్యలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, అర్జిత సేవా టిక్కెట్లు తీసుకున్నారని, తరువాత వాటిని ఇతరులకు విక్రయించారని అధికారులు అంటున్నారు. గత ఏడాది ఒకే ఫోన్ నెంబర్ తో 34 సార్లు దర్శన టిక్కెట్లు బుక్ చేశారని అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. ఆన్ లైన్ విధానంలో ఈ గోల్ మాల్ జరిగిందని ఈవో ఐటీ విభాగం సిబ్బంది పరిశీలనలో వెలుగు చూసింది.

Thousands of TTD Arjita Seva tickets have been booked with a single phone number

ఆన్ లైన్ లో ఓ వ్యక్తి అతని ఫోన్ నెంబర్ తో 1,279 సార్లు అర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడని వెలుగు చూడటంతో టీటీడీ ఈవో జే శ్యామలరావుతో పాటు ఈవో ఐటీ విభాగం సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది. ఒక వ్యక్తి వేల సంఖ్యలో అర్జిత సేవా టిక్కెట్లు బుక్ చెయ్యడం సామాన్యమైన విషయం కాదని, టీటీడీ సిబ్బంది సహకారం లేనిదే అలా చెయ్యడం సాధ్యం కాదని అదే టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగులు అంటున్నారు.

కొందరికి లబ్ది చేకూరేందుకు టీటీడీ సిబ్బంది కూడా చూసిచూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. మరో ఫోన్ నెంబర్ తో 43 సార్లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, అర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేశారని వెలుగు చూసింది. మరో ఫోన్ నెంబర్ తో ఆన్ లైన్ లో ఏకంగా 807 గదలు బుక్ చేశారని అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి సంవత్సరంలో 807 సార్లు తిరుమల వచ్చి ఉండటం ఎలా సాధ్యం అవుతుందని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు రెండుసార్లు గదులు బుక్ చేసినా కూడా ఒక సంవత్సరంలో 807 గదులు బుక్ చెయ్యడం సాధ్యం కాదని, అలాంటిది ఒకే ఫోన్ నెంబర్ తో ఓ వ్యక్తి అన్ని సార్లు గదులు ఎలా బుక్ చేశాడు అని అధికారులు అంటున్నారు సంవత్సరానికి ఎన్ని రోజులు, ఆ వ్యక్తి అతని ఫోన్ నెంబర్ తో బుక్ చేసిన గదులు ఎన్ని, ఆ గదులు ఎవరెవరికి ఇచ్చారు, ఒక్క ఫోన్ నెంబర్ తో వందల సంఖ్యలో గదులు బుక్ చేశారని అధికారుల పరిశీలనలో వెలుడు చూసింది.

Thousands of TTD Arjita Seva tickets have been booked with a single phone number

అలా బుక్ చేసిన గదులు తరువాత దళారుల చేతిలో పెట్టి వాటిని బ్లాక్ లో విక్రయించారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది వంద ఫోన్ నెంబర్లతో టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, అర్జిత సేవా టిక్కెట్లు, తిరుమల కొండ మీద గదులు బుక్ చేసి వాటిని అధిక మొత్తానికి విక్రయించారని టీటీడీ ఈవో ఐటీ విభాగం అధికారుల పరిశీలనతో వెలుగు చూసింది.

మొత్తం ఫోన్ నెంబర్లు, ఆ వ్యక్తుల పేర్లు, వివరాలు సేకరించిన టీటీడీ ఈవో జే శ్యామలరావు ఇప్పుడు మొత్తం సమాచారం బయటకు లాగుతున్నారని, త్వరలో విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి సిద్దం అయ్యారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో చేతివాటం చూపించిన దళారులతో పాటు కొందరు టీటీడీ ఉద్యోగులుకు ఇప్పుడు దడ మొదలైయ్యింది, గోవిందుడు పేరు చెప్పుకుని దందాలు చేసిన వారికి త్వరలో చుక్కలు కనపడుతాయని శ్రీవారి భక్తులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+