కేఈ నుంచి ప్రాణహాని.. మాకేం జరిగినా ఆయనదే బాధ్యత: నారాయణరెడ్డి భార్య
తమ కుటుంబానికి ఏం జరిగినా.. కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. రాజకీయల లబ్ది కోసమే తమ కుటుంబాన్ని కేఈ కుటుంబం వేధిస్తోందని వాపోయారు.
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ చార్జీ నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నారాయణరెడ్డి కుటుంబం సహా వైసీపీ నేతలంతా ఆయన వైపే వేలెత్తి చూపించారు. కేఈ మాత్రం ఈ హత్యకు తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి కేఈపై మరోసారి ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబే కారణమని ఆరోపించారు. కేఈ కృష్ణమూర్తి అక్రమాలపై పోరాడినందుకే తన భర్తను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేఈ కుటుంబం నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని శ్రీదేవి రెడ్డి పేర్కొనడం గమనార్హం.

తమ కుటుంబానికి ఏం జరిగినా.. కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. రాజకీయల లబ్ది కోసమే తమ కుటుంబాన్ని కేఈ కుటుంబం వేధిస్తోందని వాపోయారు. తన భర్త హత్య కేసులో పోలీసులు హంతకులకు మద్దతుగా నిలుస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డి ఎంతో పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తుచేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications